క్రీడాభూమి

గుజరాత్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 14: ఐపిఎల్‌లో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్‌పై గుజ రాత్ లయన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పుణే నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18 ఓ వర్లలోనే చేరుకుంది. కెప్టెన్ సురేష్ రైనా, ఆరోన్ ఫించ్ గు జరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
టాస్‌ను కోల్పోయ, తొలుత బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 33, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 43, బెన్ స్టోక్స్ 25, మనోజ్ తివారీ 31, అంకిత్ శర్మ 25 చొప్పున పరుగులు చేశారు.
ఆండ్రూ టైకి ఐదు వికెట్లు
గుజరాత్ పేసర్ ఆండ్రూ టై వరుసగా అంకిత్ శర్మ, మనోజ్ తివారీ, శార్దూల్ ఠాకూర్ వికెట్లను పడగొట్టి హ్యా ట్రిక్ పూర్తి చేశాడు. అతను మొత్తం 17 పరుగులిచ్చి 5 వి కెట్లు కూల్చాడు. ఐపిఎల్‌లో తొలి మ్యాచ్‌లో ఒక బౌలర్ అత్యుత్తమ విశే్లషణ ఇదే. కాగా, ప్రవీణ్ కుమార్, రవీంద్ర జడేజా, స్మిత్ తలా ఒక్కో వికెట్ తీశారు.
అలవోకగా..
పుణే బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం తో, గుజరాత్ ఓపెనర్లు డ్వెయన్ స్మిత్, బ్రెండన్ మెక్‌కలం అలవోకగా పరుగులు రాబట్టారు. 94 పరుగుల స్కోరు వద్ద గుజరాత్ మొదటి వికెట్ కోల్పోయంది. 30 బంతు లు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగు లు చేసిన డ్వెయన్ స్మిత్‌ను రాహుల్ చాహర్ క్యాచ్ పట్ట గా శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మెక్‌కలం 47 పరుగుల వ్య క్తిగత స్కోరువద్ద ధోనీ స్టంప్ చేయడంతో అవుటయ్యా డు. కేవలం మూడు పరుగులు చేసిన దినేష్ కార్తీక్‌ను ఇ మ్రాన్ తాహిర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో గుజరాత్ ఇబ్బందు ల్లో పడింది. అయతే, కెప్టెన్ సురేష్ రైనా, ఆరోన్ ఫించ్ బాధ్యతాయుతమైన ఆట గుజరాత్‌ను ఆదుకుంది. లుకీ ఫెర్గూసన్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది గుజరాత్ విజయానికి ఫించ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 18 ఓవర్లలోనే మూడు వికెట్లకు గుజరాత్ 172 పరుగులు చే యగా, ఫించ్ 19 బంతుల్లో 33 (మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), రైనా 22 బంతుల్లో 35 (నాలుగు ఫోర్లు, ఒక సి క్సర్) క్రీజ్‌లో ఉన్నారు.
మొత్తం మీద శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌లు ఉ త్కంఠ భరితంగా సాగాయ. రెండు మ్యాచ్‌ల్లోనూ హ్యా ట్రిక్స్ నమోదు కావడం విచిత్రం. ఐపిఎల్ చరిత్రలో ఇ లాంటి సంఘటన జరగడం ఇదే మొదలు.