క్రీడాభూమి

ఆసక్తి రేపుతున్న సచిన్ బయోపిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 14: క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ జీవితం ఆధారంగా నిర్మించిన ‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్’ చిత్రం ఆసక్తి రేపుతున్నది. 1989 నుంచి 2013 వరకు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించిన సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒకడిగా చరిత్ర సృష్టించాడు. తన బయోపిక్ వచ్చేనెల 26న విడుదలవుతుందని సచిన్ స్వయంగా ప్రకటించడంతో ఇప్పటి నుంచి అభిమానుల సందడి మొదలైంది. జేమ్స్ ఎర్స్‌కిన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు.