క్రీడాభూమి

క్వార్టర్స్‌లో సింధు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఏప్రిల్ 14: సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు ఓటమిపాలైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్‌ను ఢీకొన్న ఆమె 11-21, 15-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు పడిపోయి, రెండు నుంచి ఐదుకు చేరిన సింధు ఇటీవలే భారత్‌లో జరిగిన ఇండియన్ ఓపెన్ ఫైనల్‌లో మారిన్‌ను చిత్తుచేసింది. అయితే, నాలుగు నుంచి రెండో స్థానానికి ఎదిగిన ఆమెను సింగపూర్‌లో సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. మొదటి సెట్‌లో చెప్పుకోగిన రీతిలో పోరాడకుండానే చేతులెత్తేసిన సింధు రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డింది. కానీ, ఆమె ప్రయత్నాలను అడ్డుకున్న మారిన్ రెండో సెట్‌నూ గెల్చుకొని, సెమీ ఫైనల్ చేరింది.
సెమీస్‌కు ప్రణీత్, శ్రీకాంత్
పురుషుల సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్స్ చేరారు. క్వార్టర్స్‌లో తనాంసక్ సయెసమ్‌బూన్సక్‌పై ప్రణీత్ 15-21, 21-14, 21-19 తేడాతో విజయం సాధించాడు. ఈ టోర్నీలో మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్న ప్రణీత్ క్వార్టర్స్‌లో మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆతర్వాత పుంజుకొని మిగతా రెండు సెట్లను గెల్చుకున్నాడు. సెమీస్‌లో అతను లీ డాంగ్ కెయున్‌తో తలపడతాడు.
మరో క్వార్టర్ ఫైనల్‌లో డాంగ్ కెయున్ 21-18, 21-16 ఆధిక్యంతో జొనథాన్ క్రిస్టీని ఓడించాడు. కాగా, శ్రీకాంత్ 21-14, 21-16 స్కోరుతో షి యుకీపై గెలిచాడు. అతను సెమీ ఫైనల్‌లో ఆంథోనీ సినిసకా గింటింగ్‌ను ఢీ కొంటాడు. గింటింగ్ క్వార్టర్స్‌లో వాంగ్ వింగ్ కీని 21-19, 21-14 ఆధిక్యంతో ఓడించాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో చుక్కెదురు
భారత్‌కు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చుక్కెదురైంది. సుమీత్ రెడ్డి, అశ్వినీ పొన్నప్ప జోడీ 11-21, 8-21 తేడాతో లూ కయ్, హువాన్ యాకియాంగ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది.