క్రీడాభూమి

మంజ్రేకర్ వ్యాఖ్యలతోనే పొలార్డ్ విజృంభణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ విజృంభణకు కారణమా? ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న అతను శుక్రవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 47 బంతుల్లో 70 పరుగులు సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడానికీ, మంజ్రేకర్ విమర్శలకూ సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే వస్తుంది. మంజ్రేకర్ ఇటీవలే ఒక మ్యాచ్‌కి కామెంటరీ చెప్తూ, పొలార్డ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే శక్తిసామర్థ్యాలు అతనికి లేవని స్పష్టం చేశాడు. ఐదారు ఓవర్లకు మించి ఆడగల ‘మానసిక పరిణతి’ పొలార్డ్‌కు లేదంటూ ఎద్దేవా చేశాడు. కాగా, తనను విమర్శించిన మంజ్రేకర్‌కు సరైన సమాధానం చెప్పేందుకు బ్యాటింగ్‌నే ఆయుధంగా ఎంచుకున్న పొలార్డ్ తనకు టాప్ ఆర్డర్‌లో ఆడే సామర్థ్యం ఉందని నిరూపించుకున్నాడు. మంజ్రేకర్ విమర్శలకు తన అద్వితీయ బ్యాటింగ్ ప్రతిభతో తగిన సమాధానం చెప్పాడు. కామెంటేటర్‌గా వ్యవహరిస్తూ ఒక ఆటగాడిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఇప్పటికే మంజ్రేకర్‌కు పలువురు హితవు పలికారు. ఇలావుంటే, పొలార్డ్‌ను విమర్శించి, అతని విజృంభణకు కారణమై, పరోక్షంగా ముంబయి విజయానికి మంజ్రేకర్ కారణమయ్యాడని బెంగళూరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భుజం గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్‌ల్లో బెంగళూరుకు నాయకత్వం వహించలేకపోయిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆడాడు. 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ, పొలార్డ్ ఇన్నింగ్స్ ముంబయిని గెలిపించింది. తాము ఓడడానికి మంజ్రేకరే కారణమని కోహ్లీ మండిపడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.