క్రీడాభూమి

సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ ఫైనల్‌కు ప్రణీత్, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఏప్రిల్ 15: భారత ఆటగాళ్లు సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన ప్రణీత్ సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియా ఆటగాడు లీ డాంగ్ కెయున్‌ను 21-6, 21-8 తేడాతో చిత్తు చేసి, సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో తొలిసారి ఫైనల్ చేరాడు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ప్రణీత్ ఆధిపత్యం కొనసాగడం విశేషం. మరో సెమీ ఫైనల్‌లో ప్రపంచ మాజీ మూడో ర్యాంకర్ శ్రీకాంత్ 21-13, 21-14 స్కోరుతో 26వ ర్యాంక్ ఆటగాడు ఆంథోనీ సినిసుక గింటింగ్‌పై విజయం సాధించి, ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. మొత్తం మీద ఇద్దరు హైదరాబాదీలు సింగపూర్‌లో సంచలనాలు సృష్టించి, టైటిల్ వేటలో తుది ఘట్టానికి చేరారు. వీరిలో ఎవరు గెలిచినా టైటిల్ భారత్‌కే దక్కుతుందని అభిమానుల సంబరం.
ఫైనల్ చేరిన మారిన్
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పివి సింధును ఓడించిన ప్రపంచ నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి కరోలినా మారిన్ అదే దూకుడును కొనసాగిస్తూ, సెమీ ఫైనల్‌లో రెండో సీడ్ సంగ్ జి హ్యున్‌ను 21-9, 21-12 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. టైటిల్ కోసం ఆమె నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్‌ను ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జూ ఇంగ్ 21-19, 21-18 స్కోరుతో బివెన్ జాంగ్‌పై గెలిచింది.