క్రీడాభూమి

పుణే చేతిలోనూ ఓడిన కోహ్లీ సేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 16: పాయంట్ల పట్టికలో అ డుగున ఉన్న రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ చేతి లోనూ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అ భిమానులను నిరాశకు గురి చేసింది. విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న బెంగళూరుకు ఐదు మ్యా చ్‌ల్లో ఇది నాలుగో పరాజయం. పుణే నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయ న కోహ్లీ సేన 27 పరుగుల తేడాతో ఓటమిపాలై, పాయంట్ల పట్టికలో అట్టడుగు స్థానికి పడింది.
బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్న కారణంగా టాస్ నెగ్గిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో లక్ష్యాన్ని నిర్దేశించేందుకు మైదానంలోకి దిగిన పుణే జట్టుకు ఓపెనర్లు అజింక్య రహానే, రాహుల్ త్రిపాఠీ శుభారంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. మొదటి వికెట్‌కు 63 పరుగులు జత కలిసిన తర్వాత మొదటి వికెట్‌గా రహానే పెవిలియన్ చేరాడు. 25 బంతుల్లో, ఐదు ఫోర్లతో 30 పరుగులు చేసిన అతనిని శామ్యూల్ బద్రీ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఆరు పరుగుల తేడాలోనే రాహుల్ త్రిపాఠీ కూడా వెనుదిరిగాడు. అతను 23 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. పవన్ నేగీ బౌలింగ్‌లో, విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోగా అవుటైన త్రిపాఠీ స్కోరులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 25 బంతుల్లో 28 పరుగులు సాధించి, పార్ట్‌టైమ్ బౌలర్ షేన్ వాట్సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 24 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేసిన స్టీవెన్ స్మిత్‌ను శ్రీనాథ్ అరవింద్ బౌల్డ్ చేశాడు. కాగా, ఈ ఏడాది అందరి కంటే అత్యధికంగా 14.5 కోట్ల రూపాయల ధర పలికిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (2), డానియల్ క్రిస్టియన్ (1), శార్దూల్ ఠాకూర్ (0) పరుగుల వేటలో విఫలమై, వికెట్లు పారేసుకున్నారు. చివరిలో కొంత సేపు బెంగళూరు బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న మనోజ్ తివారీ ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటయ్యాడు. అతను 11 బంతుల్లోనే, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు సాధించాడు. పుణే 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేయగా, జైదేవ్ ఉనాద్కత్ రెండు పరుగులతో క్రీజ్‌లో నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో ఆడం మిల్నే, శ్రీనాథ్ అరవింద్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
ఆరంభంలో తడబాటు
నిరుటి రన్నరప్‌గా బరిలోకి దిగినప్పటికీ, మొదటి మ్యాచ్‌ని డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో కోల్పోయినప్పటికీ, ఆతర్వాత కోలుకున్న బెంగళూరు రెండో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది. కానీ, ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ చేతిలో పోగొట్టుకుంది. ఈ వైఫల్యాల బాటను వీడాలంటే, 162 పరుగుల అత్యంత సాధారణమైన లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగళూరు మొదట్లో తడబడింది. 14 పరుగుల వద్ద మన్దీప్ సింగ్ వికెట్‌ను చేజార్చుకుంది. అతను పరుగుల ఖాతా తెరవకుండానే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ధోనీ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 19 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పరుగుల వేగాన్ని పెంచే పించ్ హిట్టర్ ఎబి డివిలియర్స్ 29 పరుగులు చేసి, ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, ధోనీ స్టంప్ చేయడంతో పెవిలియన్ చేరాడు. పుణే జట్టుకు చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ, క్రీజ్‌లో ఆడుతున్న కేదార్ జాదవ్, షేన్ వాట్సన్ ఆరంభంలో నిలదొక్కుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో పరుగుల వేగం తగ్గింది. నాలుగో వికెట్‌కు 21 పరుగులు జతకలిసిన అనం తరం జైదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్ (18) బౌల్డ్ అయ్యాడు. 14 పరుగులు చేసిన వాట్స న్‌ను బెన్ స్టోక్స్ బౌల్డ్ చేశాడు. 101 పరుగులకు 5 వికెట్లు కోల్పోయన బెంగళూరు కష్టాల్లో పడింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠీకి క్యాచ్ ఇచ్చిన పవన్ నేగీ 11 పరుగులు చేశాడు. వే గంగా పరుగులు రాబడుతున్న స్టువర్ట్ బిన్నీ (18) కూడా అదే ఓవర్‌లో అవుటయ్యాడు. శామ్యూల్ బ ద్రీ (0)ని ఉనాద్కత్ బౌల్డ్ చేయగా, 126 పరుగుల వద్ద బెంగళూరు ఎనిమిదో వికెట్ కోల్పోయంది. మొత్తం మీద చివరి ఓవర్‌లో ఈ జట్టు విజయానికి అసాధ్యమైన 31 పరుగుల దూరంలో నిలిచింది. బె న్ స్టోక్స్ వేసిన ఆ ఓవర్‌లో బెంగళూరు కేవలం 3 పరుగులు చేసి, మిల్నే (2) వికెట్ కోల్పోయంది. 20 ఓవర్లలో ఈ జట్టు 9 వికెట్లకు 134 పరుగులు చే యగా, యుజువేంద్ర చాహల్ (1), శ్రీనాథ్ అర వింద్ (6) క్రీజ్‌లో ఉన్నారు. శార్దూల్ ఠాకూర్ 35 పరుగులకు మూడు వికెట్లు, బెన్ స్టోక్స్ 18 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. జైదేవ్ ఉనాద్కత్ 25 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
సంక్షిప్త స్కోర్లు
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 (అజింక్య రహానే 30, రాహుల్ త్రిపాఠీ 31, స్టీవెన్ స్మిత్ 27, మహేంద్ర సింగ్ ధోనీ 28, మనోజ్ తివారీ 27, ఆడం మిల్నే 2/27, శ్రీనాథ్ అరవింద్ 2/29).
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: (విరాట్ కోహ్లీ 28, ఎబి డివిలియర్స్ 29, కేదార్ జాదవ్ 18, శార్దూ ల్ ఠాకూర్ 2/35, బెన్ స్టోక్స్ 3/18, జైదేవ్ ఉనాద్క త్ 2/25).