క్రీడాభూమి

భళా భువీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాట్‌తో కెప్టెన్ వార్నర్ మెరుపులు
ఆసక్తికర పోరులో సన్‌రైజర్స్‌దే విజయం
5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవెన్ చిత్తు

హైదరాబాద్, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ ట్వంటీ-20 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా రెండు విజయాలు సాధించి మరో రెండు పరాజయాలను ఎదుర్కొన్న సన్‌రైజర్స్ సోమవారం హైదరాబాద్ (ఉప్పల్)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించగా, కింగ్స్ ఎలెవెన్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్‌తో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (70-నాటౌట్), బంతితో పేసర్ భువనేశ్వర్ కుమార్ (5/19) చక్కగా రాణించి సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో కింగ్స్ ఎలెవన్ నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ మనన్ వోహ్రా (95-నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయింది.
అంతకుముందు టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ప్రత్యర్థి బౌలర్లు గడగడ లాడించారు. వీరి జోరును తట్టుకోలేక సన్‌రైజర్స్ మరోసారి బ్యాటింగ్‌లో తడబడింది. మొహిత్ శర్మ 5వ ఓవర్‌లో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (15 బంతుల్లో 15)ను పెవిలియన్‌కు చేర్చి సన్‌రైజర్స్‌ను తొలి దెబ్బ తీయగా, అతని స్థానంలో వచ్చిన మోజెస్ హెన్రిక్స్ (16 బంతుల్లో 9)తో పాటు యువరాజ్ సింగ్ (0)ను అక్షర్ పటేల్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. దీంతో సన్‌రైజర్స్ 50 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కింగ్స్ ఎలెవెన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని క్రీజ్‌లో నిలదొక్కుకున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటంతో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. నాలుగో వికెట్‌కు వార్నర్ 60 పరుగులు జోడించిన తర్వాత వికెట్‌కీపర్ నమన్ ఓజా (20 బంతుల్లో 34) కరియప్ప బౌలింగ్‌లో వికెట్ల వెనుక వృద్ధిమాన్ సాహా చేతికి చిక్కగా, అతని స్థానంలో వచ్చిన దీపక్ హుడా (10 బంతుల్లో 12), మొహమ్మద్ నబీ (3 బంతుల్లో 2) స్వల్పస్కోర్లకే నిష్క్రమించారు. అయితే 54 బంతుల్లో 70 పరుగులు సాధించిన వార్నర్, ఆడిన ఒకే ఒక్క బంతిని సిక్సర్‌గా మలచిన రషీద్ ఖాన్ అజేయంగా నిలవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. కింగ్స్ ఎలెవెన్ బౌలర్లలో మొహిత్ శర్మ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు కైవసం చేసుకోగా, సందీప్ శర్మ, కెసి.కరియప్ప చెరో వికెట్ సాధించారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై భువనేశ్వర్ కుమార్ (5/19) నిప్పులు చెరిగాడు. దీంతో తొలి బంతికే ఓపెనర్ హషీమ్ ఆమ్లా (0) వికెట్‌ను, 17వ బంతికి ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (16 బంతుల్లో 9) వికెట్‌ను చేజార్చుకున్న కింగ్స్ ఎలెవెన్ జట్టులో ఆ తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. మనన్ వోహ్రా దూకుడుగా ఆడి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఇయాన్ మోర్గాన్ (17 బంతుల్లో 13), డేవిడ్ మిల్లర్ (1), వృద్ధిమాన్ సాహా (0), అక్షర్ పటేల్ (12 బంతుల్లో 7), మొహిత్ శర్మ (5 బంతుల్లో 10), కెసి.కరియప్ప (5 బంతుల్లో 1) వరుసగా విఫలమవగా, ఒంటరి పోరాటం చేసిన మనన్ వోహ్రా (50 బంతుల్లో 95)ను భువనేశ్వర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 5 బంతులను ఎదుర్కొన్న ఇశాంత్ శర్మ 2 పరుగుకే సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో చేతులెత్తేయడంతో 19.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ విజయానికి 5 పరుగుల దూరంలో బొక్కబోర్లా పడింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ చక్కగా రాణించి 19 పరుగులకే 5 వికెట్లు కైవసం చేసుకోగా, రషీద్ ఖాన్‌కు 2 వికెట్లు, మోజెస్ హెన్రిక్స్, మొహమ్మద్ నబీ, సిద్ధార్థ్ కౌల్‌కు ఒక్కో వికెట్ చొప్పున లభించాయి.

ఐసిసి సమావేశానికి
శ్రీని వెళ్లకూడదు
‘సుప్రీం’ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: వచ్చే వారం జరుగనున్న ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) సమావేశంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రాతినిథ్యం వహించే అర్హత బిసిసిఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు లేదని, బిసిసిఐతో పరస్పర ప్రయోజనాల వ్యవహారంలో అతను దోషిగా తేలడమే ఇందుకు కారణమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 24వ తేదీన జరుగనున్న ఐసిసి సమావేశంలో బిసిసిఐకి బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతి ఇస్తున్నామని, ఆయనతో పాటు ఐసిసి సమావేశానికి వెళ్లాల్సిందిగా బిసిసిఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఓ) రాహుల్ జోహ్రీని ఆదేశిస్తున్నామని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎఎం.ఖన్వీల్కర్, జస్టిస్ డివై.చంద్రచూడ్ కూడా సభ్యులుగా ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనేందుకు బిసిసిఐతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఆఫీస్ బేరర్ల పదవులను చేపట్టేందుకు అనర్హులైన వ్యక్తులను నామినేట్ చేయకూడదని సుప్రీం కోర్టు ఈ నెల 10వ తేదీనే స్పష్టం చేసిన విషయం విదితమే.

ఇలాగైతే చాలా కష్టం!

చెత్త ప్రదర్శనతో ఎలా గెలుస్తాం? * ఫార్ములాను అనే్వషించాల్సిందే
‘చాలెంజర్స్’ వైఫల్యాలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి

బెంగళూరు, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తమ జట్టు పేలవమైన ప్రదర్శనలతో ఘోరంగా విఫలమవుతుండటంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇటువంటి చెత్త ప్రదర్శనతో విజయం సాధించే అర్హత తమ జట్టుకు లేదని, కనుక సాధ్యమైనంత త్వరగా తాము ‘గెలుపు ఫార్ములా’ను కనిపెట్టాల్సిన అవసరం ఉందని కోహ్లీ ఉద్ఘాటించాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు మ్యాచ్‌లలో ఓటముల పాలై పాయింట్ల పట్టికలో అథమ స్థానంలో నిలవడంతో కోహ్లీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌కు పుణె సూపర్‌జెయింట్స్ చేతిలో ఓటమి ఎదురైన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌లో తమ జట్టు గట్టిగానే పోరాడినప్పటికీ తమ కళ్ల ముందే మ్యాచ్ చేజారిపోయిందని, తమ జట్టులో కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. బెంగళూరులోని సొంత మైదానంలో తాము ఏ జట్టునైనా ఓడించగలమని భావించడం లేదని అతను చెప్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంతో పాటు, అభిమానుల ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత తమ జట్టుపై ఉందని కోహ్లీ స్పష్టం చేశాడు. ‘గత ఏడాది మేము నాకౌట్ దశకు అర్హత సాధించేందుకు చివరి నాలుగు లీగ్ మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతిసారీ ఇలాగే జరగకూడదు. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎంతో మంది అభిమానుల సమక్షంలో జట్టు యాజమాన్యం కోసం ఆడుతున్న మేము ఇటువంటి పరిస్థితి రానీయకూడదు. కనుక ఇకమీదట మా జట్టులోని ప్రతి సభ్యుడు బాధ్యతాయుతంగా ఆడుతూ పరిస్థితులను అనుకూలంగా మారుస్తారని ఆశిస్తున్నా’ అని కోహ్లీ తెలిపాడు.
బౌలర్ల లోటును తీర్చేందుకే : వెట్టోరీ
ఇదిలావుంటే, ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో తమ జట్టు మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్ డేనియల్ వెట్టోరీ అంగీకరించాడు. ఆదివారం పుణె సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను పక్కన పెట్టి తమ తుదిజట్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు చోటు కల్పించడాన్ని వెట్టోరీ సమర్ధించుకున్నాడు. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లలో, ప్రత్యేకించి ముంబయి ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో తమ జట్టుకు ఒక బౌలర్ తగ్గాడని భావించామని, ఈ లోటును పూడ్చాలన్న ఆలోచనతోనే పుణెతో జరిగిన మ్యాచ్ నుంచి క్రిస్ గేల్‌ను పక్కన పెట్టి అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ రాణించే సామర్థ్యమున్న వాట్సన్‌ను తుది జట్టులోకి తీసుకున్నామని వెట్టోరీ చెప్పాడు.