క్రీడాభూమి

అండర్-17 ఫుట్‌బాల్‌లో భారత్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: యూరప్‌లో భారత అండర్-17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ జట్టు పర్యటన ఓటమితో ప్రారంభమైంది. లిస్బన్‌లోని జోస్ వౌరిన్హో ట్రైనింగ్ సెంటర్‌లో మంగళవారం పోర్చుగల్‌కు చెందిన విటోరియా డీ సెటుబల్ అండర్-17 జట్టుతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థులతో దీటుగానే తలపడినప్పటికీ అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలుచుకోలేకపోయింది. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ 38వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను బ్రూనో వెంచ్యురా గోల్‌గా మలచడంతో ప్రథమార్థం ముగిసే సమయానికి ప్రత్యర్థులు 1-0 ఆధిక్యత సాధించారు. దీంతో ద్వితీయార్థంలో మరింత విజృంభించి ఆడిన భారత జట్టు ప్రత్యర్థుల గోల్‌పోస్టుపై పదేపదే దాడులు చేసింది. 47, 48 నిమిషాల్లో అంకిత్ జాదవ్‌కు గోల్స్ సాధించే అవకాశాలు వచ్చినప్పటికీ తృటిలో విఫలమయ్యాడు. అయితే 67వ నిమిషంలో అతను పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ఈక్వలైజర్‌ను సాధించిన భారత జట్టు ఆ తర్వాత ఆధిక్యత కోసం ఎంతగానో శ్రమించినప్పటికీ సఫలీకృతం కాలేదు. దీంతో 85వ నిమిషంలో మరో గోల్ సాధించిన సెటుబల్ జట్టు 2-1 గోల్స్ తేడాతో భారత జట్టును ఓడించింది. పోర్చుగల్‌లోని జమొర్‌లో ఈ నెల 25వ తేదీన జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో భారత అండర్-17 జట్టు బెలెనెనె్సస్ జట్టుతో తలపడనుంది.

నిరూపించుకోవాల్సిన
అవసరంలేదు
ధోనీకి స్పిన్ లెజెండ్ వార్న్ బాసట
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: క్రికెట్ మ్యాచ్‌లకు అద్భుతమైన రీతిలో ముగింపునిచ్చే దిట్టగా పేరు పొందిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సామర్థ్యంపై ప్రస్తుతం విమర్శకుల నుంచి ప్రశ్నలు వస్తుండటంతో ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికడు షేన్ వార్న్ అతనికి అండగా నిలిచాడు. ధోనీ ఇప్పుడు కొత్తగా ఎవరి ముందూ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని వార్న్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియర్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ ట్వంటీ-20 టోర్నమెంట్‌కు ముందే రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి ఉద్వాసనకు గురైన ధోనీ ఈ ఏడాది ఐపిఎల్‌లో తన స్థాయికి తగిన ఆటను ప్రదర్శించడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటివరకూ ఆడిన ఐదు ఐపిఎల్ మ్యాచ్‌లలో అతను కేవలం 87.14 సగటుతో మొత్తం 61 పరుగులు మాత్రమే సాధించడంతో విమర్శకులు ధోనీ సామర్ధ్యంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో ధోనీకి వార్న్ బాసటగా నిలిచాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో ధోనీ ఎంతో సొగసైన, అద్భుతమైన ఆటగాడే కాకుండా, ఎంతో స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ అని, కనుక అతను ఇప్పుడు కొత్తగా ఎవరి ముందూ ఏమీ నిరూపించుకోల్సిన అవసరం లేదని వార్న్ ట్వీట్ చేశాడు. గత ఏడాది కాలం నుంచి ధోనీ స్థిరంగా రాణించలేకపోతున్నప్పటికీ మ్యాచ్‌ను గెలిపించే శక్తిసామర్ధ్యాలు అతనికి ఇప్పటికీ ఉన్నాయన్నది, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికీ ధోనీయే నెంబర్ వన్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ అన్నది నిర్వివాదాంశం.