క్రీడాభూమి

శ్రీశాంత్‌కు బిసిసిఐ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, ఏప్రిల్ 18: కళంకిత ఫాస్ట్ బౌలర్ ఎస్.శ్రీశాంత్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మరోసారి షాకిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని తొలగించే ప్రసక్తే లేదని బిసిసిఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు బిసిసిఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్ జోహ్రీ నుంచి శ్రీశాంత్‌కు ఆదివారం లేఖ అందింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి ఢిల్లీ హైకోర్టు తనకు విముక్తి కల్పించినందున తనపై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ శ్రీశాంత్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో బిసిసిఐ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. క్రమశిక్షణ విషయంలో బోర్డు ఎంతో పట్టుదలతో ఉందని, కనుక శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని విధిస్తూ 2013 సెప్టెంబర్‌లో తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని రాహుల్ జోహ్రీ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా బిసిసిఐ ఉపాధ్యక్షుడు టిసి.మాథ్యూ (కేరళ క్రికెట్ సంఘ అధ్యక్షుడు), కేరళ క్రికెట్ సంఘ కార్యదర్శి టిఎన్.అనంతనారాయణన్ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకున్న విషయాన్ని జోహ్రీ ఆ లేఖలో గుర్తు చేశారు. 2013లో జరిగిన ఐపిఎల్ ఆరో ఎడిషన్‌లో శ్రీశాంత్‌తో పాటు అప్పటి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వీరిపై ఢిల్లీ పోలీసులు సంఘటిత నేరాల చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించిన విషయం విదితమే. అయితే 2015లో ఢిల్లీ హైకోర్టు ఈ కేసు నుంచి వీరికి విముక్తి కల్పించడంతో పాటు నిషేధంపై బిసిసిఐ ఎదుట రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో శ్రీశాంత్ తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ కేరళ హైకోర్టులో గత నెల రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.