క్రీడాభూమి

దుబాయ్‌లో టైసన్ అకాడెమీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఏప్రిల్ 19: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ దుబాయ్ కేంద్రంగా ఫిట్నెస్ అకాడెమీని ఏర్పాటు చేయనున్నాడు. మైక్ టైసన్ అకాడెమీ (ఎంటిఎ) పేరుతో అతను గొలుసు ఫిట్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాడు. అందులో భాగంగానే దుబాయ్‌లో ఫ్రాంచైజీని తెరవాలని నిర్ణయించాడు. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తాడని అతని సన్నిహితులు అంటున్నారు. డబ్ల్యుబిఎ, డబ్ల్యుబిసి, ఐబిఎఫ్ ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెల్చుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన టైసన్ ఆతర్వాత పలు వివాదాల్లో చిక్కుకొని ఆర్థికంగా చితికిపోయాడు. 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ చాంపియన్‌గా విశేష కీర్తిప్రతిష్ఠలు రావడంతో అతను క్రమశిక్షణను పూర్తిగా మరచిపోయాడు. ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం కేసులో జైలు శిక్షను కూడా అనుభవించాడు. కెరీర్ నాశనమై, ఆస్తి మొత్తం వివాదాలు, సెటిల్‌మెంట్లకు ఆహుతికాగా, ఉపాధి కోసం స్టార్ హోటళ్లలో ఎగ్జిబిషన్ బాక్సింగ్ ఫైట్స్‌లో పాల్గొన్నాడు. క్రమంగా నిలదొక్కుకొని, ఇప్పుడు ఎంటిఎ పేరుతో ఫిట్నెస్ సెంటర్ల వ్యాపారాన్ని ఆరంభించి, తక్కువ సమయంలోనే లాభాల బాట పట్టించాడు. దుబాయ్‌కి తాను చాలాసార్లు వెళ్లాలని, అక్కడ ఫిట్నెస్ సెంటర్‌కు ఎక్కువ ఆదరణ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని టైసన్ ట్వీట్ చేశాడు. తాను నెలకొల్పిన ప్రతి సెంటర్‌లోనూ వ్యాపారం నిలకడగా సాగేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పాడు. ఆసియాలో తన వ్యాపారం బాగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు. వచ్చేనెల ఆరున దుబాయ్ సెంటర్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని అన్నాడు.