క్రీడాభూమి

‘సాయ్’ కేంద్రాల పరిస్థితులపై గోయల్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని కేంద్రాల స్థితిగతులను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ అన్నారు. అన్ని కేంద్రాల్లోనూ అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కోచ్‌ల వివరాలతో సంపూర్ణ నివేదిక అందించాలని ‘సాయ్’ని ఆయన ఆదేశించారు. కొన్ని కేంద్రాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ గోయల్ అన్నారు. ఇటీవల తాను సందర్శించిన రాయ్‌పూర్‌లోని ‘సాయ్’ కేంద్రం దుస్థితిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అక్కడి స్టేడియం ప్రభుత్వ ఆధీనంలో ఉందని, దీనితో మున్సిపల్ కార్పొరేషన్ దానిని వివాహాలు, ఇతర కార్యక్రమాలకు ఇస్తూ, అద్దె వసూలు చేస్తున్నదని తెలిపారు. అక్కడ కోచ్‌లు ఉన్నప్పటికీ, సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో క్రీడాకారులు తగినంత మంది రావడం లేదని పేర్కొన్నారు. ఫుట్‌బాల్‌లో కేవలం 11 మంది శిక్షణ పొందుతున్నారని, కనీసం రెండు జట్లను సిద్ధం చేసి పోటీలను నిర్వహించే పరిస్థితి కూడా లేనప్పుడు కోచ్‌లు ఏం చేస్తారని ప్రశ్నించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ‘సాయ్’ కేంద్రాలను పరిశీలించానని, కోచ్‌లను నియమించాలని సూచించానని మంత్రి తెలిపారు. కోచ్‌ల శక్తిసామర్థ్యాలను, వారు అందిస్తున్న సేవలను విశే్లషించడానికి వీలుగా సమగ్ర నివేదికలను కోరినట్టు తెలిపారు. మణిపూర్‌లో మాదిరి గ్వాలియర్‌లో ఒక క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నదని గోయల్ చెప్పారు. గత తొమ్మిది నెలల కాలంలో తాను సందర్శించని క్రీడా సంస్థగానీ, విభాగంగానీ లేవని వ్యాఖ్యానించారు. పటియాలా లేదా గ్వాలియర్.. ‘సాయ్’ కేంద్రాలు లేదా గోపీచంద్ అకాడెమీ... ఇలా ప్రతి కేంద్రాన్నీ తాను సందర్శించి, పరిస్థితులను తెలుసుకున్నానని అన్నారు. గ్వాలియర్‌లో అద్భుతమైన సదుపాయాలు ఉన్నాయని, అందుకే, అక్కడ స్పోర్ట్స్ యూనివర్శిటీ కోసం ప్రయత్నిస్తున్నామని గోయల్ తెలిపారు.
డోపింగ్‌ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చే అవకాశాలు లేవని మంత్రి గోయల్ స్పష్టం చేశారు. డోప్‌పై చట్టం తేవడం అసాధ్యమని అన్నారు. 2015 నుంచి వరుసగా మూడు సంవత్సరాలుగా ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) సమర్పిస్తున్న నివేదికల్లో భారత్ పేరు కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. చాలా దేశాల్లో డోపింగ్‌ను తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు. అయితే, మన దేశంలో డోప్ నేరాలు, శిక్షలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలుగానీ, చట్టాలుగానీ లేవు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను ఉపయోగించడాన్ని తీవ్రంగా పరిగణించాలని, కఠిన శిక్షలు అమలు చేయాలని చాలాకాలంగా డిమాండ్ వినిపిస్తున్నది. ఇందుకుగాను ఒక కొత్త చట్టాన్ని తేవాలని కూడా చాలా మంది కోరుతున్నారు. కానీ, డోప్‌పై చట్టానికి అవకాశాల్లేవని గోయల్ అన్నారు. వాడా ఆధ్వర్యంలో జరిగిన డోప్ పరీక్షల్లో పట్టుబడిన వారు ఎక్కువగా ఉన్న దేశాల్లో రష్యా (176 మంది), ఇటలీ (129) తర్వాత భారత్ (117 మంది) మూడో స్థానంలో ఉన్నారు. పెరుగుతున్న డోప్ కేసులను విలేఖరులు ప్రస్తావించగా, చట్టం అనేది తప్పు చేయాలనుకున్న వారిని భయపెట్టడానికే ఉపయోగపడుతుందని అన్నారు. ఉత్ప్రేరకాలను వాడితే కఠినంగా శిక్షిస్తామని, ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేశామని గుర్తుచేశారు. అందుకే, ప్రత్యేకంగా చట్టం తేవాల్సిన అవసరం లేదన్నది తన అభిప్రాయమన్నారు.
ఆర్‌టిఐ పరిధిలోకి బిసిసిఐ రాదు!
సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) రాదా? కేంద్రం నుంచి మినహాయింపు లభించనుందా? ఈ ప్రశ్నలకు గోయల్ దాదాపుగా అవుననే సమాధానమిచ్చారు. బిసిసిఐ కేసు సుప్రీం కోర్టులో ఉందని, కాబట్టి దానిని ఆర్‌టిఐ పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఏదీ కేంద్రానికి లేదని మంత్రి తెలిపారు. అయితే, దేశంలోని మిగతా అన్ని క్రీడా సంఘాలు, సమాఖ్యలను ఆర్‌టిఐ పరిధిలోకి తెస్తామని స్పష్టం చేశారు.