క్రీడాభూమి

భారత్ ఆధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. గురువారం పోటీలు ముగిసే సమయానికి భారత్ 136 స్వర్ణం, 77 రజతం, 20 కాంస్యాలతో మొత్తం 233 పతకాలను కైవసం చేసుకొని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. శ్రీలంక 146 (24 స్వర్ణం, 48 రజతం, 74 కాంస్యం) పతకాలతో రెండో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ 7 స్వర్ణం, 22 రజతం, 41 కాంస్యాలతో మొత్తం 70 పతకాలను సంపాదించి తృతీయ స్థానంలో కొనసాగుతున్నది. షూటింగ్‌లో భారత్ క్లీన్‌స్వీప్ సాధించి సత్తా చాటింది. ఐదు స్వర్ణాలకు పోటీలు జరిగే, అన్నింటినీ భారత్ కైవసం చేసుకుంది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టోల్ ఈవెంట్‌లో సమరేష్ జంగ్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అతను 580 పాయింట్లు సంపాదించగా, పెంబా తమాంగ్ 579 పాయింట్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత విజయ్ కుమార్ 577 పాయింట్లతో కాంస్య పతకానికి పరిమితం కావాల్సి వచ్చింది. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో హాట్ ఫేవరిట్ గగన్ నారంగ్ రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ విభాగంలో చైన్ సింగ్ 184.1 పాయింట్లు సంపాదించి స్వర్ణ పతకం సాధించాడు. నారింగ్ 183.1 పాయింట్లతో రజత పతకాన్ని అందుకోగా, పాకిస్తాన్‌కు చెందిన ఉమర్ సిద్ధిఖీ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. అనంతరం, చైన్ సింగ్, నారంగ్, సురేంద్ర సింగ్ రాథోడ్ సభ్యులుగా ఉన్న భారత జట్టు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ టీం ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పాకిస్తాన్‌కు రజతం, శ్రీలంకకు కాంస్య పతకం లభించాయి. కాగా, మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో కుహేలీ గంగూలీ 619.9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని అందుకుంది. లజ్జా గోస్వామి (608.2), అనుజా జంగ్ (607.5) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. అనంతరం టీం ఈవెంట్‌లో ఈ ముగ్గురూ స్వర్ణ పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. పాకిస్తాన్‌కు రజతం, లంకకు కాంస్య పతకం లభించాయి.
టెన్నిస్‌లోనూ క్లీన్‌స్వీప్
టెన్నిస్‌లోనూ భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషులు, మహిళల సిగిల్స్, డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లోనూ స్వర్ణాలను కైవసం చేసుకుంది. అంతకు ముందే మూడు ఈవెంట్స్‌లో విజేతగా నిలిచిన భారత్‌కు గురువారం మరో రెండు ఈవెంట్స్‌లోనూ స్వర్ణాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో రాంకుమార్ రామనాథన్ మన దేశానికే చెందిన సాకేత్ మైనేనీని 7-5, 6-3 తేడాతో ఓడించి టైటిల్ అందుకున్నాడు. మహిళల డబుల్స్ విభాగంలో ప్రార్థనా తొంబ్రే, షర్మదా బూలూషికా జో 7-5, 2-6, 10-4 ఆధిక్యంతో రిషిక సుంకర, నటాషా పల్హా జోడీపై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. అంతకు ముందు, పురుషుల డబుల్స్‌లో రాంకుమార్ రామనాథన్, విజయ్ ప్రశాంత్ జోడీ 6-3, 6-4 స్కోరుతో దివిజ్ శరణ్, సనమ్ సింగ్ జోడీపై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల సింగిల్స్‌లో అంకితా రాణా 6-1, 6-0 తేడాతో మన దేశానికే చెందిన ప్రేరణ భంబ్రీని చిత్తుచేసింది. అనంతరం ఆమె దివిజ్ శరణ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో పాల్గొని, 6-2, 7-6 ఆధిక్యంతో సనమ్ సింగ్, ప్రార్థన తొంబ్రే జోడీపై నెగ్గింది.
మహిళల ఫుట్‌బాల్: మహిళల ఫుట్‌బాల్‌లో నేపాల్‌ను ఢీకొన్న భారత్ మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. కాగా, ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం ద్వారా నేపాల్ వరుసగా రెండోసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆ జట్టు రెండు విజయాలు, ఒక డ్రాతో మొత్తం ఏడు పాయింట్లు సంపాదించి ఫైనల్‌లో స్థానం దక్కించుకుంది. ఐదు పాయింట్లు సాధించిన భారత్, ఆరు పాయింట్లు సంపాదించుకున్న బంగ్లాదేశ్ తమతమ చివరి మ్యాచ్‌లో ఢీ కొంటాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్‌లో నేపాల్‌ను ఎదుర్కొనే అవకాశం దక్కుతుంది.
ఇలావుంటే, భారత మహిళా ఫుట్‌బాల్ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న గ్రేస్ డాంగ్‌మే గాయపడింది. దీనితో ఆమె బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కి అందుబాటులో ఉంటుందా అన్నది అనుమానంగా మారింది. ఆమె లేకుండా బరిలోకి దిగితే భారత జట్టుకు సమస్యలు తప్పవని విశే్లషకుల అభిప్రాయం.

చిత్రం... పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ టీం ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న
భారత జట్టులోని సభ్యులు (ఎడమ నుంచి కుడికి) చైన్ సింగ్, గగన్ నారంగ్, సురేంద్ర సింగ్

రాంచీకి ఢిల్లీ షాక్
ఢిల్లీ, ఫిబ్రవరి 11: హాకీ ఇండియా లీగ్ (హెచ్ ఐఎల్)లో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాంచీ రేస్‌కు ఢిల్లీ వేవ్‌రైడర్స్ షాకిచ్చింది. పాయంట్ల ప ట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాంచీ, అట్టడుగు స్థానంలోని ఢిల్లీ మధ్య పోరాటం చప్పగా సాగు తుందని అంతా ఊహించారు. కానీ, అందరి అం చనాలకు భిన్నంగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది. ఢిల్లీ 7-4 తేడాతో రాంచీపై విజయభేరి మోగించింది. మన్దీప్ సింగ్, తల్వీందర్ సింగ్ చె రి రెండు గోల్స్ సాధించి, ఢిల్లీని గెలిపించారు. వీటిలో మూడు ఫీల్డ్ గోల్స్ కావడంతో, ఆ జట్టు కు మొత్తం ఏడు గోల్స్ లభించాయ. కాగా, రాం చీ తరఫున 35వ నిమిషంలో ఆష్లే జాక్సన్, 50వ నిమిషంలో ట్రెంట్ మోటోన్ గోల్స్ సాధించారు. ఈ రెండు ఫీల్డ్ గోల్స్. ఫలితంగా రాంచీకి నాలు గు గోల్స్ లభించాయ. కాగా, ఈ మ్యాచ్ ఫలితం పాయంట్ల పట్టికపై ప్రభావం చూపలేదు. రాంచీ నంబర్ వన్ స్థానంలో కొనసాగున్నది.