క్రీడాభూమి

సన్‌రైజర్స్ విజయభేరి ( 15 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19:ఐపిఎల్‌లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సన్‌రైజర్స్ కూడా ఇప్పటి వరకూ అదే విధానాన్ని అనుసరించింది. అయితే, బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన తర్వాత బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. నిరుడు అత్యధిక పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసిన అతను క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో అమిత్ మిశ్రా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. దీనితో శిఖర్ ధావన్‌కు భాగస్వామిగా ఫస్ట్‌డౌన్‌లో కేన్ విలియమ్‌సన్ బ్యాటింగ్‌కు దిగాడు. జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించిన అతను డేర్‌డెవిల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శిఖర్ ధావన్ కూడా గత వైఫల్యాలను పక్కకుపెట్టి, బాధ్యతాయుతంగా ఆడడంతో సన్‌రైజర్స్ స్కోరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 14.2 ఓవర్లలో 136 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 148 పరుగుల వద్ద కేన్ విలియమ్‌సన్ వికెట్ కూలింది. అతను 51 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో 89 పరుగులు చేసి, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు చిక్కాడు. సెంచరీని అతను 11 పరుగుల తేడాతో చేజార్చుకున్నప్పటికీ, సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పాత్రను అర్ధవంతంగా పోషించాడు. అతనితో కలిసి జట్టుకు అండగా నిలిచిన శిఖర్ ధావన్ 70 పరుగులు సాధించి, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లోనే ఏంజెలో మాథ్యూస్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. 50 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఆతర్వాతి బంతికే యువరాజ్ సింగ్ వికెట్‌ను మోరిస్ సాధించాడు. మూడు పరుగులు చేసిన యువీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హ్యాట్రిక్ సాధించే అవకాశం క్రిస్ మోరిస్‌కు లభించినప్పటికీ, దానిని దీపక్ హూడా అడ్డుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుకు వికెట్లకు 191 పరుగులు చేయగా, అప్పటికి దీపక్ హూడా 9, మోజెస్ హెన్రిక్స్ 12 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కూడిన నాలుగు వికెట్లను క్రిస్ మోరిస్ సాధించడం విశేషం.
డేర్‌డెవిల్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపక్రమించి, 14 పరు గుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను శామ్ బిల్లింగ్స్ రూపంలో చేజార్చుకుంది. అతను 13 పరుగులు చేసి, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో దీపక్ హూడా క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. యువరాజ్ సింగ్ బౌలింగ్‌లో ఒక ప రుగును పూర్తి చేసి, రెండో పరుగు కోసం ప్రయత్నించిన కరుణ్ నాయర్ రనౌట్ అయ్యాడు. అతను 23 బంతులు ఎదు ర్కొని, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 33 పరు గులు సాధించాడు. సంజూ శాంసన్‌తో కలిసి అతను రెండో వికెట్‌కు 7.1 ఓవర్లలో 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించా డు. రిషభ్ పంత్ ఒక్క పరుగు కూడా చేయకుండా యువరాజ్ సింగ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు చిక్కాడు. శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ భాగస్వామ్యంలో 12.2 ఓవర్లలో డేర్ డెవిల్స్ 100 పరుగుల మైలురాయని చేరింది. తర్వాత కొద్ది సేపటికే ఓపెనర్ సంజూ శాంసన్ అవుటయ్యాడు. అతను 33 బంతుల్లో 42 పరుగులు చేసి, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో మోజెస్ హెన్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయ. శ్రేయాస్ అయ్యర్, ఏంజెలో మాథ్యూస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ, సాధించిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో, జట్టును విజయపథంలో నడిపించలేకపోయారు. చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు అవసరంకాగా, భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్‌లో డేర్‌డెవిల్స్‌కు 10 పరుగులు లభించాయ. దీనితో చివరి ఓవర్‌లో దాదాపు అసాధ్యంగా కనిపించే 24 పరుగుల దూరంలో డేర్‌డెవిల్స్ నిలిచింది. .

ఈసారి ఐపిఎల్‌లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న మూడో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ గుర్తింపు పొందింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెరి రెండు పర్యాయాలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాయి. చెరొక విజయాన్ని సాధించాయి. ఒక్కో మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూశాయి.
ఒక ఐపిఎల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు కూలితే, అన్నింటినీ ఒకే బౌలర్ సాధించడం ఇది రెండోసారి. 2011లో ఆర్పీ సింగ్ మొదటిసారి ప్రత్యర్థి జట్టు కోల్పోయన నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ ఈ ఘనతను సాధించి ఆర్పీ సింగ్ సరసన స్థానం సంపాదించాడు.