క్రీడాభూమి

సెరెనాపై సస్పెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 20: టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ గర్భవతి కాదా? ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం సెరెనా గర్భవతి అని ప్రచారం జరిగింది. మరో 20 నెలల్లో తొలి బిడ్డకు తల్లికాబోతున్నదన్న వార్త అత్యంత వేగంగా ప్రచారమైంది. కానీ, హఠాత్తుగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను సెరెనా డిలీట్ చేసింది. దీనితో టెన్నిస్ ప్రపంచంలో గందరగోళం నెలకొంది. సెరెనా తన ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్‌లో ఫొటోను ఉంచి ‘మరో 20 వారాలు’ అని పేర్కోవడంతో, ఆమె గర్భవతి అనే సమాచారం అందరికీ తెలిసింది. దీనికితోడు లాస్ ఏంజిల్స్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఒక పబ్లికేషన్ అధినేత కెల్లీ బుష్ నొవాక్ కూడా సెరెనా విషయాన్ని ప్రస్తావించాడు. ‘సెరెనా ఈ ఏడాది సెప్టెంబర్‌లో తల్లికాబోతున్నది’ అని ప్రకటించాడు. అంతకు ముందే, తన బాయ్‌ఫ్రెండ్, రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌తో నిశ్చితార్థంపై సెరెనా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టింది. అతనితో జమైకాలో విహార యాత్రకు వెళ్లిన ఆమె అక్కడి ఫొటోలను కూడా అప్‌లోడ్ చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం చాలాకాలంగా కొనసాగుతున్న విషయం బహిరంగ రహస్యమే. కాగా, ఇటీవలే కెల్లీ రోలాండ్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెరెనా తాను తల్లిని కాబోతున్నట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్నాప్‌షాట్ ఉంచింది. ‘మరో 20 వారాలు’ అన్న ట్యాగ్‌లైన్‌ను ఉంచడంతో, సెప్టెంబర్ మాసంలో ఆమె బిడ్డకు జన్మనివ్వనుందన్న వార్త ప్రచారమైంది. కానీ, కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడంతో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొంది. సెరెనాగానీ, ఆమె సంబంధీకులుగానీ ఈ విషయంలో నోరు విప్పడంలేదు. మొత్తం మీద సెరెనా గర్భవతి అవునా? కాదా? అనేది ప్రస్తుతానికి సస్పెనే్స.

చిత్రం..ప్రియుడు అలెక్సిస్ ఒహానియన్‌తో సెరెనా