క్రీడాభూమి

బార్సిలోనాకు జువెంటాస్ బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, ఏప్రిల్ 20: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్ ఫేవరిట్ బార్సిలోనాకు జువెంటాస్ బ్రేక్ వేసింది. బార్సిలోనాతో క్వార్టర్ ఫైనల్స్ రెండో లెగ్ మ్యాచ్‌ని జువెంటాస్ డ్రా చేసుకుంది. ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. కాగా, క్వార్టర్స్‌లో జరిగిన ఇతర దశల్లో వచ్చిన ఫలితాల ఆదారంగా జువెంటాస్‌కు సెమీస్‌లో స్థానం దక్కింది. అంతకు ముందు పారిస్ సెయింట్ జెర్మెయిన్‌ను ఎదుర్కొని వెనుకంజలో ఉన్న బార్సిలోనా ఆతర్వాత పుంజుకొని, ప్రత్యర్థిని 6-0 తేడాతో చిత్తుచేయడం ద్వారా మళ్లీ రేసులోకి వచ్చింది. కానీ, జువెంటాస్ రక్షణ వలయాన్ని ఛేదించలేక మ్యాచ్‌ని డ్రాతో ముగించింది. అత్యంత కీలకమైన మ్యాచ్ డ్రా కావడంతో బార్సిలోనా రేసు నుంచి వైదొలగింది. 2015 చాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో బార్సిలోనా చేతిలో ఓటమిపాలైన జువెంటాస్ ఈసారి ప్రతీకారం తీర్చుకుంది.

చిత్రం..బార్సిలోనా, జువెంటాస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంతి కోసం ఇరు జట్ల హోరాహోరీ