క్రీడాభూమి

ధోనీకి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించింది. ధోనీని విష్ణుమూర్తి అవతారంగా చూపిస్తూ, అతను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వివిధ ఉత్పత్తులను అతని చేతుల్లో ఉన్నట్టు ఒక పత్రిక కవర్ పేజీపై ఫొటోను ముద్రించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ‘విష్ణు’ వివాదంపై ఇంతకు ముందు కర్నాటకలో కేసు నమోదైంది. ఆతర్వాత ఆంధ్ర ప్రదేశ్ నుంచి కూడా మరో కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీశాడని ఆ కేసుల్లో పిటిషనర్లు ఆరోపించారు. కర్నాటకలో నమోదైన కేసును ఇది వరకే కొట్టేసిన సుప్రీం కోర్టు తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో నమోదైన కేసును కూడా తోసిపుచ్చింది. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనిగానీ లేదా కుట్ర పూరితంగాగానీ ధోనీ వ్యవహరించలేదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జరిగిన సంఘటనలో ధోనీని దోషిగా నిరూపించే ఆధారాలు ఏవీ లేవని పేర్కొంది. అందుకే కేసును కొట్టేస్తున్నట్టు తెలిపింది.