క్రీడాభూమి

బట్లర్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఏప్రిల్ 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన 22వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై ముంబయి ఇండియన్స్ విజయభేరి మోగించింది. హషీం ఆమ్లా సూపర్ సెంచరీతో ప్రత్యర్థి ముందు పంజాబ్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. అయతే, ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ముంబయ 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జొస్ బట్లర్ విజృంభణకు నితీష్ రాణా సమయోచిత బ్యాటింగ్ తోడు కావడంతో ఇంకా 27 బంతులు మిగిలి ఉండగానే ముంబయ ఎనిమి వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ను ఆమ్లా శతకం ఆదుకోలేకపోయంది.
ప్రత్యర్థి కెప్టెన్ రోహిత్ శర్మ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆమ్లా, షాన్ మార్ష్ మొదటి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. 21 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్ల సాయంతో 26 పరుగులు సాధించిన షాన్ మార్ష్‌ను కీరన్ పొలార్డ్ క్యాచ్ అందుకోగా మిచెల్ మెక్‌క్లీనగన్ అవుట్ చేశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ముంబయి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక, 15 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన అతనిని కృణాల్ పాండ్య క్లీన్ బౌల్డ్ చేశాడు. సాహా అవుట్ కావడం పంజాబ్‌కు పరోక్షంగా లాభించింది. సెకండ్ డౌన్‌లో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ గ్లేన్ మాక్స్‌వెల్ ముంబయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను క్రీజ్‌లో ఉన్నంత సేపు పంజాబ్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. కేవలం 18 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 40 పరుగులు చేసిన అతనిని జస్‌ప్రీత్ బుమ్రా బౌల్డ్ చేయడంతో ముంబయి ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆమ్లా పరుగుల వేటను కొనసాగించాడు. మర్కస్ స్టొయినిస్ ఒక పరుగు చేసి, మెక్‌క్లీన్‌గన్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్‌కు దొరికిపోయినప్పటికీ, ఆమ్లా విజృంభణ కొనసాగింది. లసిత్ మలింగ వెసిన చివరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది అతను సెంచరీ పూర్తి చేశాడు. 20 ఓవర్లలో పంజాబ్ నాలుగు వికెట్లకు 198 పరుగులు సాధించింది. ఆమ్లా 104 (60 బంతులు, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు), అక్షర్ పటేల్ 4 (ఐదు బంతులు) నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్ మెక్‌క్లీనగన్ 46 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. కృణాల్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా చెరొక వికెట్ సాధించారు.
ఆరంభం నుంచే దూకుడు
భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పటికీ, ఆరంభం నుం చే ముంబయ దూకుడుగా ఆడింది. పార్థీవ్ పటేల్ 18 బం తుల్లోనే 37 పరుగులు సాధించగా, ఏడు ఫోర్లు, ఐదు సి క్సర్లతో విరుచుకుపడిన జొస్ బట్లర్ 37 బంతుల్లో 77 ప రుగులు చేశాడు. ఆతర్వాత జట్టును గెలిపించే బాధ్యత ను నితీష్ రాణా తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యతో కలిసి అతను మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు. 15.3 ఓ వర్లలో ముంబయ రెండు వికెట్లు కోల్పోయ 199 పరుగు లు సాధించి, ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ముంబ య ఛేదించిన భారీ లక్ష్యం ఇదే.
* కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఓపెనర్ హషీం ఆమ్లా ఈ మ్యాచ్‌లో కేవలం లసిత్ మలింగ బౌలింగ్‌లోనే 51 పరుగులు సాధించాడు. ఐపిఎల్ చరిత్రలోనే ఒక బౌలర్‌పై అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 2013లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ 52 పరుగులు చేశాడు.
* లసిత్ మలింగ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు కొట్టి ఆమ్లా సెంచరీ పూర్తి చేశాడు. ఐపిఎల్‌లోనేగాక, టి-20 ఫార్మాట్‌లోనే అతనికి ఇది తొలి సెంచరీ. తాను టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం కానని ఈ శతకంతో నిరూపించాడు. ఆమ్లా నుంచి స్ఫూర్తి పొందిన గ్లేన్ మాక్స్‌వెల్ విజృంభణ కొనసాగింది. వీరిద్దరూ ఆదుకోకపోతే, పంజాబ్ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమై కష్టాల్లో పడేది.
* ముంబయి ఇండియన్స్‌పై ఐపిఎల్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ మూడో ఆటగాడిగా చోటు సంపాదించాడు. సురేష్ రైనా (707), మహేంద్ర సింగ్ ధోనీ (524) ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
* ఇన్నింగ్స్‌లో 15, 16 ఓవర్లలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 50 పరుగులు కొల్లగొట్టింది.

* కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బౌలర్ మిచెల్ మెక్‌క్లీనగన్ 15వ ఓవర్ బౌల్ చేసినప్పుడు గ్లేన్ మాక్స్‌వెల్‌కు 28 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో ఇదే రెండో దుబారా ఓవర్. పదో ఐపిఎల్‌లోనే ముంబయితో పుణేలో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా 30 పరుగులిచ్చాడు. మెక్‌క్లీనగన్ రెండో స్థానంలో ఉండగా, 2013 ఐపిఎల్‌లో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్ డేవిడ్ హస్సీ 27 పరుగులిచ్చాడు. అతను ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
* ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఇది ఆరో మ్యాచ్. ఈ జట్టు ఇంత వరకూ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడించిన ఆటగాళ్లు 13 మంది మాత్రమే. మిగతా జట్లతో పోలిస్తే, జట్టులో ఎక్కువ మార్పులు చేయని జట్టు ముంబయి మాత్రమే. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెరి 19 మందితో ప్రయోగాలు చేశాయి.

చిత్రం..ముంబయ విజయంలో కీలక పాత్ర పోషించిన జొస్ బట్లర్