క్రీడాభూమి

ఆ విషయమే నాకు తెలియదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 13: హ్యాట్రిక్ గురించి తనకు తెలియదని, తన దృష్టి మొత్తం ఆటపైనే కేంద్రీకరించడంతో తాను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని శ్రీలంక మీడియం పేసర్ తిసర పెరెరా ఇక్కడి నుంచి శనివారం విశాఖపట్నం బయలుదేరే ముందు పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. శుక్రవారం భారత్‌తో జరిగిన రెండో టి-20లో 19వ ఓవర్‌ను పెరెరా బౌల్ చేశాడు. చివరి మూడు బంతుల్లో అతను వరుసగా హార్దిక్ పాండ్య, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ వికెట్లు పడగొట్టాడు. టి-20 ఇంటర్నేషనల్స్‌లో అతనికి ఇదే మొదటి హ్యాట్రిక్. 2010 మేలో అతను ఇంగ్లాండ్‌పై అత్యుత్తమంగా 19 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. ఇప్పుడు భారత్‌పై చిరస్మరణీయ బౌలింగ్ విశే్లషణను నమోదు చేశాడు. టి-20 ఇంటర్నేషనల్స్‌లో బ్రెట్‌లీ, జాకబ్ ఓరమ్, టిమ్ సౌథీ తర్వాత ఈ ఫీట్‌ను సాధించిన బౌలర్‌గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాడు. సహచరులు తనతో చెప్పేవరకూ హ్యాట్రిక్ గురించి తాను పట్టించుకోలేదని తిసర పెరెరా అన్నాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ సరళిని ప్రశంసించాడు. అతనిని నియంత్రీకరించేందుకు తాము చాలా కష్టపడ్డామని చెప్పాడు. చివరిదైన మూడో టి-20లో హోరాహోరీ పోరాటం తప్పదని స్పష్టం చేశాడు. ఇరు జట్లు బలంగా ఉన్నాయని, కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.