క్రీడాభూమి

చాంపియన్స్ లీగ్ సెమీస్‌కు మొనాకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొనాకో, ఏప్రిల్ 21: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ సెకండ్ లెగ్‌లో బొరష్యా డార్ట్‌మండ్‌ను 3-1 తేడాతో ఓడించిన మొనాకో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మొత్తం మీద ఈ జట్టు రెండ లెగ్‌ను 6-3 సగటుతో తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ మూడో నిమిషంలోనే కిలియన్ మాపే ద్వారా మొనాకోకు తొలి గోల్ లభించింది. ఆతర్వాత కూడా అదే దూకుడును కొనసాగించిన మొనాకో 17వ నిమిషంలో మరో గోల్ సాధించింది. రాడమెల్ ఫాల్కావో ఈ గోల్ చేశాడు. ఆతర్వాత మొనాకో రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, గోల్స్ కోసం డార్ట్‌మండ్ ఎదురుదాడి మొదలుపెట్టింది. 48వ నిమిషంలో ఆ జట్టుకు మార్కో రుయెస్ గోల్‌ను అందించాడు. అనంతరం రక్షణ వలయాన్ని మరింత బలోపేతం చేసిన మొనాకో తన ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. 81వ నిమిషంలో వెలెరె జర్మెయిన్ చేసిన గోల్‌తో మొనాకో 3-1 ఆధిక్యానికి చేరుకొని, అదే తేడాతో మ్యాచ్‌ని ముగించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.