క్రీడాభూమి

శుభారంభమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 22: మలేసియాలోని ఇఫోలో ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో ఆరంభ మ్యాచ్‌లే కీలక పాత్ర పోషిస్తాయని భారత చీఫ్ కోచ్ రొలాంట్ అల్ట్‌మన్స్ అభిప్రాయపడ్డాడు. మొదట్లో బాగా ఆడి, విజయాలను నమోదు చేస్తే, ఆతర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం ఉంటుందని శనివారం రాత్రి జట్టుతో కలిసి ఇఫో బయలుదేరే ముందు విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. భారత జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారని, వారికి అజ్లాన్ షా టోర్నీ ఎంతో అనుభవాన్ని అందిస్తుందని అన్నాడు. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, న్యూజిలాండ్, జపాన్, మలేసియా జట్లతో భారత్ ఢీకొనాల్సి ఉన్న విషయాన్ని అతను ఈ సందర్భంగా గుర్తుచేశాడు. వీటిలో ఆస్ట్రేలియాను బలమైన జట్టుగా అతను అభివర్ణించాడు. అయితే, గత ఏడాది కాలంలో భారత జట్టు అన్ని రకాలుగానూ పుంజుకున్నదని అన్నాడు. ఆసీస్‌సహా ఎలాంటి ప్రత్యర్థినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు. యువ, సీనియర్ ఆటగాళ్ల సమ్మేళనంతో వ్యూహాలను సిద్ధం చేసుకొని మ్యాచ్‌లు ఆడతామని చెప్పాడు. ఇటీవల నిర్వహించిన 40 రోజుల శిక్షణా శిబిరంలో ఆటగాళ్లంతా అన్ని విభాగాల్లోనూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారని అన్నాడు. వీరంతా అజ్లాన్ షాలో అద్భుతంగా రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నాడు.

చిత్రం..రొలాంట్ అల్ట్‌మన్స్