క్రీడాభూమి

డేర్‌డెవిల్స్‌పై ముంబయ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఏప్రిల్ 22: ఐపిఎల్‌లో శనివారం జరిగి న రెండో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ముంబయ ఇం డియన్స్ 14 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యా టింగ్ చేసిన ఈ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 ప రుగులు మాత్రమే చేసింది. అయతే, ఆతర్వాత ప్రత్యర్థి ని 128 పరుగులకు పరిమితం చేసి, విజయభేరి మో గించింది. కాగా, ఒకానొక దశలో యాభై పరుగులు కూడా చేయలేని స్థితిలో ఉన్న డేర్‌డెవిల్స్ ఆతర్వాత పుంజుకొని వంద పరుగులను దాటడం విశేషం.
డేర్‌డెవిల్స్ బ్యాటింగ్ ఎంచుకోకుండా, లక్ష్యాన్ని ఛే దించడానికే ప్రాధాన్యం ఇవ్వడం ఆరంభంలో సరైన ని ర్ణయమేనని అనిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయ 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విషయం లో డేర్‌డెవిల్స్ సఫలమైందనే చెప్పారు. జొస్ బట్లర్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, మిగతా వా రి వైఫల్యాలు ఏ విధంగా కొనసాగాయో అర్థం చేసుకో వచ్చు. కీరన్ పొలార్డ్ (26), హార్దిక్ పాండ్య (24) కొంత వరకూ రాణించారు. డేర్‌డెవిల్స్ బౌలర్లు అమిత్ మిశ్రా 18 పరుగులకు రెండు, పాట్ కమిన్స్ 20 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.
ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆనందం డే ర్‌డెవిల్స్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. ఇన్నింగ్స్ ప్రారం భించిన వెంటనే ఒకదాని తర్వాత మరొకటిగా వికెట్లు కూలడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. మొదటి ఓవ ర్ నాలుగో బంతికి ఆదిత్య తారే (0) అవుటయ్యాడు. స్టార్ ఆటగాళ్లు సంజూ శాంసన్ (9), కరుణ్ నాయర్ (5), శ్రేయాస్ అయ్యర్ (5), కొరీ ఆండర్సన్ (0), రిషభ్ పంత్ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. 24 పరుగులకే ఆరు వికెట్లు కూలిన తరుణంలో, ఐపిఎల్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్‌కు ఉన్న పే రును డేర్‌డెవిల్స్ తుడిచేయడం ఖాయంగా కనిపించిం ది. 2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై రాజ స్థాన్ 58 పరుగులకు ఆలౌటైంది. అయతే, ఆ ప్రమా దం నుంచి డేర్‌డెవిల్స్‌ను కాగిసో రబదా, క్రిస్ మోరిస్ తప్పించారు. ఆతర్వాత, తక్కువ స్కోర్ల జాబితాలో రెం డు, మూడు స్థానాలను కూడా అధిగమించారు. 16.4 ఓవర్లలో స్కోరును వంద పరుగుల మైలురాయకి చే ర్చారు. వీరు ఏడో వికెట్‌కు 12.1 ఓవర్లలో 91 పరుగు లు జోడించారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో జస్‌ప్రీత్ బు మ్రా బౌలింగ్‌లో అవుటైన రబదా 44 పరుగులు చేశా డు. చివరి ఓవర్‌లో డేర్‌డెవిల్స్ విజయానికి 25 పరుగు ల దూరంలో నిలిచింది. అయతే ఆ ఓవర్‌లో పది పరు గులు లభించాయ. 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 128 ప రుగులు చేసిన డేర్‌డెవిల్స్ 14 పరుగుల తేడాతో ఓట మిపాలైంది.

చిత్రం..మిచెల్ మెక్‌క్లీనగన్ (3 వికెట్లు)