క్రీడాభూమి

ఆ చివరి రెండు ఓవర్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను శనివారం నాటి మ్యాచ్‌లో ఓడించే క్రమంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంది. అడ్డంకులను అధిగమించి, విజయభేరి మోగించింది. ప్రత్యేకించి చివరి రెండు ఓవర్లు పుణే ఆటగాళ్ల పట్టుదలకు నిదర్శనంగా నిలిచాయి. అప్పటికి పుణే విజయానికి 30 పరుగుల దూరంలో నిలిచింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ను వేసిన భువనేశ్వర్ కుమార్ సంధించిన మొదటి బంతి వికెట్లకు దూరంగా వెళ్లడంతో, వైడ్ రూపంలో పుణే జట్టుకు ఒక పరుగు లభించింది. ఆ బంతి లెక్కలోకి రానందున, ఆ ఓవర్‌లో పుణేకు ఆరు బంతులు మిగిలాయి. మొదటి రెండు బంతులను ఫోర్లుగా మార్చిన ధోనీ, మూడో బంతిలో భారీ సిక్స్ కొట్టి, తన అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. నాలుగో బంతిలో అతను ఒక పరుగు తీయగా, ఐదో బంతిలో తివారీ సింగిల్ తీశాడు. చివరి బంతిలో ధోనీకి రెండు పరుగులు లభించాయి. మొత్తం మీద ఆ ఓవర్‌లో పుణే 19 పరుగులను రాబట్టింది.
చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరంకాగా, సిద్ధార్థ్ కౌల్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని మనోజ్ తివారీ ఫోర్ కొట్టాడు. తర్వాత సింగిల్ తీశాడు. ధోనీ కూడా సింగిల్‌తో సరిపుచ్చితే, నాలుగో బంతిలో తివారీ ఒక పరుగుతో సరిపుచ్చాడు. దీనితో చివరి రెండు బంతుల్లో విజయానికి నాలుగు పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతిలో ధోనీ రెండు పరుగులు సంపాదించడంతో, చివరి బంతిలో పుణే విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచింది. ఆ బంతిలో పరుగు రాకుండా అడ్డుకుంటే గెలుపు తమదేనని, కనీసం ఒక పరుగుకు పుణేను పరిమితం చేస్తే మ్యాచ్ టైగా ముగుస్తుందన్న ఆశతో సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ ఫీల్డింగ్‌ను కట్టుదిట్టం చేశాడు. ధోనీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం ఉన్న ధోనీ ముందు అతని పాచిక పారలేదు. ‘గ్రేట్ ఫినిషర్’గా తనను ఎందుకు పిలుస్తారన్న విషయాన్ని నిరూపించే రీతిలో అతను ఎక్‌స్ట్రా కవర్ దిశగా బంతిని కొట్టి రెండు పరుగులు సాధించి, జట్టును ఆరు వికెట్ల తేడాతో గెలిపించాడు. మొత్తం మీద ఈ మ్యాచ్ చివరి క్షణం వరకూ తీవ్ర ఉత్కంఠ రేపి, అభిమానులను ఉర్రూతలూగించింది.
**

* ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు రైజింగ్ పుణే సూపర్‌జెయంట్‌స ఓపెనర్ రాహుల్ త్రిపాఠీ స్ట్రయక్ రేట్ 160. పదో ఐపిఎల్‌లో కనీసం 15 బంతులు ఎదుర్కొన్న ఓపెనర్లలో ఎక్కువ స్ట్రయక్ రేట్ ఉన్న ఐదుగురిలో అతను కూడా ఒకడు. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రయక్ రేట్ 143.9.
* సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఐపిఎల్‌లో 177 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించిన జట్టు రెండు మాత్రమే. ఈ జాబితాలో పుణే మూడో జట్టుగా చేరింది.
* సన్‌రైజర్స్ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు. భారత్‌లో జరిగిన ఒక ఐపిఎల్ మ్యాచ్‌లో, కనీసం 30 బంతులను అర్హతగా తీసుకుంటే, అత్యంత నింపాదిగా ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మన్ అతనే.
వార్నర్, శిఖర్ ధావన్ 49 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. పదో ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ నమోదైన యాభైకి పరుగుల పార్ట్‌నర్‌షిప్స్‌లో ఎక్కువ బంతులు మింగేసిన భాగస్వామ్యం ఇదే.
**