క్రీడాభూమి

రికార్డు అరంగేట్రం వాషింగ్టన్ సుందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే: ఈ మ్యాచ్‌తో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తరఫున యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఐపిఎల్‌లో రంగ ప్రవేశం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరంకావడంతో, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన సుందర్‌కు పుణే ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో అవకాశం లభించలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం నాటి మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన 17 ఏళ్ల సుందర్ ఐపిఎల్ మ్యాచ్ ఆడిన పిన్న వయస్కుల జాబితాలో మూడో స్థానాన్ని ఆక్రమించాడు. 2015 ఎనిమిదో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపిఎల్ మ్యాచ్ ఆడినప్పుడు సర్ఫ్‌రాజ్ ఖాన్ వయసు 17 సంవత్సరాల 177 రోజులు. 2008 ఐపిఎల్ మొదటి సీజన్‌లో సందీప్ సంగ్వాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున 17 ఏళ్ల 179 రోజుల వయసులో మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు మూడో స్థానాన్ని ఆక్రమించిన సుందర్ వయసు 17 సంవత్సరాల 199 రోజులు.

చిత్రం..వాషింగ్టన్ సుందర్