క్రీడాభూమి

వరల్డ్ రిలే చాంపియన్‌షిప్స్ గాల్టిన్, ఎలైన్ సూపర్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసో (బహమాస్), ఏప్రిల్ 23: అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న వరల్డ్ రిలే చాంపియన్‌షిప్స్‌లో సూపర్ స్టార్లు జస్టిన్ గాల్టిన్, ఎలైన్ థాంప్సన్ అసాధారణ ప్రతిభతో రాణించి, తమతమ జట్లను గెలిపించారు. పురుషుల 4న100 మీటర్ల రిలేలో అమెరికా తరఫున చివరి లెగ్ పరిగెత్తిన గాల్టిన్ సుడిగాలి వేగాన్ని అందుకొని, ప్రత్యర్థుల కంటే ముందుగా లక్ష్యాన్ని చేరాడు. మొత్తం మీద అమెరికా 38.43 సెకన్లలో రిలేను పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మారియో బుర్కే, రామోన్ గిటెన్స్, నికొలాస్ డాషాంగ్, బర్క్‌హార్ట్ ఎలిస్ జూనియర్ సభ్యులుగా ఉన్న బార్బడాస్ జట్టు 39.18 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. 39.22 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచిన చైనా జట్టులో జియాంగ్‌క్వియాన్ టాంగ్, జెంగ్‌యే జీ, బింగ్‌టియాన్ సూ, జిన్‌షెంగ్ లియాంగ్ సభ్యులు.
మహిళల 4న200 మీటర్ల రిలేలో జమైకాను ఎలైన్ థాంప్సన్ విజయపథంలో నడిపింది. గాల్టిన్ మాదిరిగానే ఈమె కూడా చివరి ల్యాప్‌లో అద్భుతంగా పరిగెత్తింది. ఒక నిమిషం, 29.04 సెకన్లలో 200 మీటర్ల దూరాన్ని పూర్తి చేసి, స్వర్ణ పతకం సాధించిన ఈ జట్టులో ఎలైన్‌తోపాటు జురా లెవీ, షెరిక్ జాక్సన్, సాస్‌హలీ ఫోర్బ్స్ సభ్యులు. ఒక నిమిషంలో 30.68 సెకన్లలో గమ్యాన్ని చేరి, రెండో స్థానాన్ని ఆక్రమించిన జర్మనీ జట్టుకు లారా మాథ్యూస్, టాట్‌జనా మాథ్యూస్, రెబెకా హాస్, జినా లకెన్‌కెంపర్ ప్రతినిథ్యం వహించారు. డాజెరియా బ్రయాంట్, టిఫానీ టౌన్‌సెండ్, ఫెలిసియా బ్రౌన్, షలోన్డా సాలమన్‌లతో కూడిన అమెరికా జట్టు రేస్‌ను ఒక నిమిషం, 30.87 సెకన్లలో పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచింది. కాగా, మహిళల 4న800 మీటర్ల రిలేలో అమెరికా (8 నిమిషాల 16.36 సెకన్లు), బెలారస్ (8 నిమిషాల 20.07 సెకన్లు), ఆస్ట్రేలియా (8 నిమిషాల 21.08 సెకన్లు) మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి.