క్రీడాభూమి

ఇది చిరస్మరణీయ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: దక్షిణ ఆసియా క్రీడల్లో హాకీ టైటిల్‌ను గెలవడం, అందులోనూ ఫైనల్‌లో పటిష్టమైన భారత్‌ను ఓడించడం ఎంతో సంతోషంగా ఉందని పాకిస్తాన్ ఆటగాడు అవైసుర్ రెహ్మాన్ అన్నాడు. భారత్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో పాకిస్తాన్ 1-0 తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఏకైక గోల్‌తో పాక్‌ను గెలిపించిన రెహ్మాన్ శనివారం పిటిఐతో మాట్లాడుతూ సమష్టిగా పోరాడినందువల్లే టైటిల్ దక్కిందని అన్నాడు. ఈ విజయం జట్టులోని ప్రతి ఒక్కరికీ చెందుతుందని చెప్పాడు. భారత ఆటగాళ్ల నుంచి తమకు చివరి క్షణం వరకూ ఎదురుదాడి తప్పలేదని తెలిపాడు. భారత జట్టును భారత్‌లోనే ఓడించి టైటిల్‌ను స్వీకరించడంతో తన చిరకాల కోరిక నెరవేరిందన్నాడు.
బాగానే ఆడాం: మన్‌దీప్
ఎక్కువ మంది యువ ఆటగాళ్లే బరిలోకి దిగినప్పటికీ, శాగ్ క్రీడల్లో తాము బాగానే ఆడినట్టు భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌దీప్ ఆంటిల్ అన్నాడు. పలువురు సీనియర్ హాకీ క్రీడారులు ప్రస్తుతం జరుగుతున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో ఆడుతున్న కారణంగా ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో భారత్ బరిలోకి దిగింది. ఫైనల్ వరకూ చేరినా, తుది పోరాటంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఈ పరాజయాన్ని మన్‌దీప్ ప్రస్తావిస్తూ, ఓడినందుకు బాధగా ఉందని, అయితే, గట్టిపోటీనిచ్చామన్న సంతృప్తి కూడా తమకు ఉందని వ్యాఖ్యానించాడు. కనీసం ఒక ఒలింపిక్స్‌లో ఆడిన ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టులో ఆరుగురు ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశాడు. భారత జట్టులో దాదాపుగా అందరూ అంతగా అనుభవం లేనివారేనని కెరీర్‌లో ఇప్పటి వరకు కేవలం 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన మన్దీప్ తెలిపాడు. ఈ కోణంలో చూస్తే భారత్ బాగానే ఆడిందని చెప్పాడు.

ఉత్కంఠ పోరులో
టైటాన్స్ గెలుపు
పుణే: ప్రో కబడ్డీలో భాగంగా ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాజ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 27-25 పాయంట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. టైటాన్స్ తరఫున మిరాజ్ షేక్ మొత్తం 11 పాయంట్లు సంపాదించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రమోద్ కుమార్ రాయ్ మూడు పాయంట్లు చేశాడు. పింక్ పాంథర్స్ ఆటగాళ్లు సోనూ నర్వాల్, మహమ్మద్ మొగులామ్ చెరి ఐదు పాయంట్లు చేసినా, జట్టును గెలిపించుకోలేకపోయారు.