క్రీడాభూమి

మెస్సీ @ 500

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, ఏప్రిల్ 24: బార్సిలోనా సాకర్ క్లబ్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆ క్లబ్ తరఫున 500 గోల్స్ మైలురాయిని చేరాడు. స్పానిష్ లీగ్ లా లిగా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా రియల్ మాడ్రిడ్‌తో హోరాహోరీగా సాగిన పోరులో మెస్సీ రెండు గోల్స్ సాధించి, బార్సిలోనాను గెలిపించాడు. అదే సమయంలో అతను బార్సిలోనా తరఫున 500 గోల్స్‌ను పూర్తి చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు ఆధిపత్య పోరాటాన్ని కొనసాగించాయి. ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకోవడానికి ఇరు జట్ల ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డారు. మ్యాచ్ 28వ నిమిషంలో ఈ డెడ్‌లాక్‌ను ఛేదించిన రియల్ మాడ్రిడ్ ఆటగాడు కార్లొస్ కాసెమిరో తొలి గోల్‌ను సాధించాడు. అయితే, మరో ఐదు నిమిషాల్లోనే బార్సిలోనాకు మెస్సీ ఈక్వెలైజర్‌ను అందించాడు. ప్రత్యర్థి రక్షణ వలయాన్ని లాఘంగా ఛేదించిన అతను మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్లి చేసిన గోల్‌ను రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు అడ్డుకోలేకపోయారు. ఆతర్వాత ఇరు జట్ల మధ్య సంకుల సమరం తీవ్ర స్థాయికి చేరింది. దీనితో ఏ ఒక్క జట్టూ గోల్స్ చేయలేకపోయింది. ద్వితీయార్ధం మూడు వంతుల సమయం ఈ విధంగానే దాడులు, ప్రతిదాడుల మధ్య ముగిసింది. 73వ నిమిషంలో ఇవాన్ టాకిటిక్ చేసిన గోల్‌తో బార్సిలోనా 2-1 ఆధిక్యాన్ని సంపాదించగా, 85వ నిమిషంలో జేమ్స్ రోడ్రిగెజ్ ద్వారా రియల్ మాడ్రిడ్‌కు ఈక్వెలైజర్ లభించింది. మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించడానికి పెనాల్టీ షూటౌట్ అప్పదన్న అభిప్రాయం నెలకొనగా, ఎక్‌స్ట్రా టైమ్‌లో మెస్సీ గోల్ చేసి, బార్సిలోనాకు విజయాన్ని సాధించిపెట్టాడు. అంతేగాక, ఆ జట్టు తరఫున 500 గోల్స్‌ను పూర్తి చేశాడు. రెండో స్థానంలో ఉన్న సీజర్ రోడ్రిగెజ్ అల్వెరెజ్ మొత్తం 232 గోల్స్ చేశాడంటే, అతని కంటే రెట్టింపు గోల్స్ సాధించిన మెస్సీ అసాధారణ సామర్థ్యాన్ని ఊహించుకోవచ్చు.