క్రీడాభూమి

‘10,000 క్లబ్’లో యూనిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు క్రికెట్‌లో 10,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో యూనిస్ ఖాన్ చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనతను అందుకున్న 13వ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెస్టుల్లో పదివేల పరుగుల హీరోలు వీరే..
1. సచిన్ తెండూల్కర్ (్భరత్) 200 మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు, 2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 168 టెస్టుల్లో 13,378 పరుగులు, 3. జాక్వెస్ కాలిస్ (దక్షిణాఫ్రికా) 166 టెస్టుల్లో 13,289 పరుగులు, 4. రాహుల్ ద్రవిడ్ (్భరత్) 164 టెస్టుల్లో 13,288 పరుగులు, 5. కుమార సంగక్కర (శ్రీలంక) 134 టెస్టుల్లో 12,400 పరుగులు, 6. బ్రియాన్ లారా (వెస్టిండీస్) 131 టెస్టుల్లో 11.953 పరుగులు, 7. శివనారైన్ చందర్‌పార్ (వెస్టిండీస్) 164 టెస్టుల్లో 11,867 పరుగులు, 8. మహేల జయవర్ధనే (శ్రీలంక) 149 టెస్టుల్లో 11,814 పరుగులు, 9. అలాన్ బార్డర్ (ఆస్ట్రేలియా) 156 టెస్టుల్లో 11,174 పరుగులు, 10. అలస్టర్ కుక్ (ఇంగ్లాండ్) 140 టెస్టుల్లో 11,057 పరుగులు, 11. స్టీవ్ వా (ఆస్ట్రేలియా) 168 టెస్టుల్లో 10,927 పరుగులు, 12. సునీల్ గవాస్కర్ (్భరత్) 125 టెస్టుల్లో 10,122 పరుగులు, 13. యూనిస్ ఖాన్ (పాకిస్తాన్) 116* టెస్టుల్లో 10,035 పరుగులు. (ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ ఇంకా పూర్తికాలేదు).
* పది వేల పరుగులను పూర్తి చేయడానికి తీసుకున్న టెస్టులను ఆధారంగా తీసుకుంటే, యూనిస్ ఖాన్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తాడు. బ్రియాన్ లారా 111, కుమార సంగక్కర 115 టెస్టుల్లో 10,000 మైలురాయిని చేరారు. ఇన్నింగ్స్ పరంగా తీసుకుంటే, బ్రియాన్ లారా, కుమార సంగక్కర, సచిన్ తెండూల్కర్ రికార్డును పంచుకుంటున్నారు. వీరంతా 195 ఇన్నింగ్స్‌లో పదివేల పరుగులను సాధించారు. యూనిస్ ఖాన్‌కు ఇది 207వ ఇన్నింగ్స్.
* ముగ్గురి బౌలింగ్‌లో యూనిస్ ఖాన్ మూడు వందలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతను ఈ అరుదైన రికార్డును రంగన హెరాత్ (334 పరుగులు), హర్భజన్ సింగ్ (332 పరుగులు), అనీల్ కుంబ్లే (331 పరుగులు)లపై సాధించాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ రంగన హెరాత్ మాత్రమే ఈ విధంగా ముగ్గురు బౌలర్లు, జేమ్స్ ఆండర్సన్, మిచెల్ జాన్సన్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 300లకుపైగా పరుగులు చేశాడు.
* యూనిస్ ఖాన్ రావల్పిండిలో 2000వ సంవత్సరం ఫిబ్రవరి 26 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌ను మొదలుపెట్టాడు. పాక్ తరఫున 116 టెస్టు ఆడుతున్నారు. ఆ దేశ స్టార్ ఆటగాళ్లు జావేద్ మియందాద్, ఇంజమాముల్ హక్ ఇంతకంటే ఎక్కువ టెస్టులు ఆడినప్పటికీ, పదివేల పరుగుల మైలురాయిని చేరుకోలేకపోయారు. ఈ ఫీట్‌ను అందుకున్న తొలి పాకిస్తానీ క్రికెటర్‌గా యూనిస్ ఖాన్ చరిత్రలో పుటల్లో చోటు దక్కించుకున్నాడు.

శతకాల్లో రెండో స్థానం!
* టెస్టు క్రికెట్‌లో పది వేల పరుగులను పూర్తి చేసే క్రమంలో సాధించిన శతకాలను లెక్కలోకి తీసుకుంటే, యూనిస్ ఖాన్‌కు సచిన్ తెండూల్కర్, సునీల్ గవాస్కర్ సరసన రెండో స్థానం లభిస్తుంది. రికీ పాంటింగ్ 35 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. యూనిస్ ఖాతాలో 32 అర్ధ శతకాలు ఉన్నాయి. అంటే, అతను 50 పరుగులను పూర్తి చేసిన తర్వాత, ఎక్కువ పర్యాయాలు వాటిని సెంచరీలుగా మార్చాడని స్పష్టమవుతుంది. ఈ విషయంలో యూనిస్ ఖాన్‌దే రికార్డు.
* యూనిస్ ఖాన్ పదివేల పరుగులను పూర్తి చేసే క్రమంలో 70 సిక్సర్లు కొట్టి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మైలురాయిని చేరే సమయానికి బ్రియాన్ లారా కొట్టిన సిక్సర్లు 69. ఆ రికార్డును యూనిస్ అధిగమించాడు. కాగా, పదివేల పరుగులను పూర్తి చేసినప్పటికీ అతి తక్కువగా కేవలం పది సిక్సర్లు మాత్రమే కొట్టిన ఘనత ఇంగ్లాండ్ ఓపెనర్ అలస్టర్ కుక్‌కు దక్కుతుంది.
* టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయిన చేరిన ఎక్కువ వయసున్న బ్యాట్స్‌మెన్ జాబితాలో యూనిస్ ఖాన్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఈ స్కోరును సాధించే సమయానికి యూనిస్ వయసు 39 సంవత్సరాల 145 సంవత్సరాలు. గతంలో శివనారైన్ చందర్‌పాల్ 37 సంవత్సరాల 254 సంవత్సరాల వయసులో పదివేల పరుగులు పూర్తి చేసి, ఈ జాబితాలో నంబర్ వన్‌గా ఉండగా, యూనిస్ అతనిని రెండో స్థానానికి నెట్టేశాడు. కాగా, సునీల్ గవాస్కర్, అలాన్ బార్డర్, స్టీవ్ వా కూడా తమ 37 సంవత్సరాల వయసులోనే పదివేల పరుగులను పూర్తి చేశారు.
* భారత్‌పై యూనిస్ ఖాన్ 17 ఇన్నింగ్స్‌లో, ఐదు శతకాలు, నాలుగు అర్ధ శతకాల సాయంతో 1,321 పరుగులు సాధించాడు. భారత్‌పై సగటున అతను 88.06 పరుగులు చేశాడు. మరే ఇతర దేశంలో యూనిస్‌కు ఇంత మెరుగైన సగటు లేదు.

* టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తి చేసే సమయానికి కెరీర్‌లో కనీసం ఒకసారి ట్రిపుల్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్. ఇంతకు ముందు బ్రియాన్ లారా, మహేల జయవర్ధనే ఈ ఫీట్‌ను అందుకున్నారు. కాగా, కుమార సంగక్కర పదివేల పరుగులను సాధించిన తర్వాత ట్రిపుల్ సెంచరీ చేశాడు.
* సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియాపై తొలి టెస్టు సెంచరీని సాధించిన యూనిస్ ఖాన్ ఆతర్వాత మరో పది దేశాల్లో శతకాలు నమోవదు చేశాడు. వీటిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఉంది. ఇన్ని దేశాల్లో సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు నెలకొల్పాడు.