క్రీడాభూమి

ముంబయకి పుణే బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఏప్రిల్ 24: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హాట్ ఫేవరిట్ ముంబయ ఇండియ న్స్‌కు రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ షాకిచ్చింది. ఆరు వ రుస విజయాలు సాధించిన ముంబయ దూకుడుకు బ్రేక్ వేసి, మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీ నికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చివరి బంతికి నెగ్గి న పుణే ఈసారి కూడా చివరి వరకూ ఉత్కంఠను కొనసా గించి, విజయంతో మ్యాచ్‌ని ముగించింది. పుణే 20 ఓవర్ల లో 6 వికెట్లకు 160 పరుగులు చేయగా, అందుకు సమా ధానంగా ముంబయ 8 వికెట్లు కోల్పోయ 157 పరుగులు చేయగలిగింది.
ముంబయ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, పుణే ఇ న్నింగ్స్‌ను మొదలు పెట్టిన అజింక్య రహానే, రాహుల్ త్రి పాఠి మొదటి వికెట్‌కు 9.3 ఓవర్లలో 76 పరుగులు జోడిం చారు. మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరిన రహానే 32 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 ప రుగులు సాధించాడు. టాప్ స్కోరర్‌గా నిలిచిన త్రిపాఠీ 31 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయ. ఆతర్వాత ఎవరూ పరుగు ల వేటను అదే రీతిలో కొనసాగించలేకపోవడంతో, పుణే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేయ గలిగింది. ఆట ఆరంభంలో చూపిన దూకుడను బట్టి చూ స్తే ఆ జట్టుకు కనీసం మరో 20 పరుగులు అదనంగా ల భించాల్సి ఉండింది. ముంబయ బౌలర్లలో కర్న్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
ముంబయ 35 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను జొస్ బట్లర్ (17) రూపంలో చేజార్చుకుంది. ఈ ఐపిఎల్‌లో అ ద్భుతంగా రాణిస్తున్న నితీష్ రాణా కేవలం మూడు పరు గులు చేసి, డానియల్ క్రిస్టియన్ బౌలింగ్‌లో జయదేవ్ ఉ నాద్కత్‌కు దొరకడం అభిమానులను నిరాశ పరచింది. ఓ పెనర్ పార్థీవ్ పటేల్ (33)ను వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 11 పరుగులు చేసిన కర్న్ శర్మను బెన్ స్టోక్స్ బౌల్డ్ చేశాడు. రోహిత్ శర్మ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడడం ముం బయ ఆశలకు ఊపిరి పోసింది. ఆల్‌రౌండర్ కీరన్ పొలా ర్డ్ 9 పరుగులు చేసి, ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు దొరికిపోవడంతో ముంబయ 122 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయంది. అనంతరం హార్దిక్ పాండ్యతో కలిసి రోహిత్ శర్మ ముంబయని విజయానికి 12 బంతుల్లో 24 పరుగులకు చేర్చాడు. బెన్ స్టోక్స్ వేసిన 19వ ఓవర్‌లో ముంబయ ఏడు పరుగులు మాత్రమే చేసింది. దీనితో చివ రి ఓవర్‌లో విజయానికి 17 పరుగుల దూరంలో నిలిచిం ది. అత్యంత కీలకమైన ఆఖరు ఓవర్‌ను వేసే బాధ్యతను జ యదేవ్ ఉనాద్కత్‌కు పుణే కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అప్పచెప్పా డు. ఆ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ, చివరి ఓవర్ మొ దటి బంతిలోనే హార్దిక్ పాండ్య (13)ను ఉనాద్కత్ అవుట్ చేశాడు. అయతే, తర్వాతి బంతిని రోహిత్ శర్మ సిక్సర్‌గా మార్చాడు. మూడోది డాట్ బాల్. నాలుగో బంతికి రోహిత్ శర్మ వికెట్ కూలింది. అతను 39 బంతుల్లో 58 పరుగులు చేసి, ఉనాద్కత్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో బంతిలో మిచెల్ మెక్‌క్లీనగన్ రనౌటయ్యాడు. చివరి బంతి ని హర్భజన్ సింగ్ సిక్సర్‌గా కొట్టాడు. మొత్తం మీద చివరి ఓవర్‌లో ముంబయకి 13 పరుగులు లభించాయ. మూడు వికెట్లు కూలాయ. 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసిన ఆ జట్టు మూడు పరుగుల తేడాతో ఓడింది.
సంక్షిప్త స్కోర్లు
రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 (అజింక్య రహానే 38, రాహుల్ త్రిపాఠీ 45, మనోజ్ తి వారీ 22, కర్న్ శర్మ 2/39, జస్‌ప్రీత్ బుమ్రా 2/29).
ముంబయ ఇండియన్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 (రోహిత్ శర్మ 58, పార్థీవ్ పటేల్ 33, జయదేవ్ ఉనాద్కత్ 2/40, బెన్ స్టోక్స్ 2/21).

రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (17)ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ముంబయ ఇండియన్స్ సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ టి-20 ఫార్మాట్‌లో 200 వికెట్లు పూర్తి చేశాడు.