క్రీడాభూమి

పాకిస్తాన్ 201/4 ( వెస్టిండీస్‌తో మొదటి టెస్టు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, ఏప్రిల్ 24: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 201 పరుగులు చేసింది. అంతకు ముందు వెస్టిండీస్ 286 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు ఆటలో విండీస్ 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. రెండో రోజు ఆటకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. కేవలం 11.3 ఓవర్ల ఆట సాధ్యంకాగా, ఆ జట్టు 34 జోడించి, రెండు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆటను కొనసాగించి, 286 పరుగుల వద్ద చివరి వికెట్‌ను చేజార్చుకుంది. విండీస్ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 201 పరుగులు చేసింది. బాబర్ ఆజం (72), యూనిస్ ఖాన్ (58) అర్ధ శతకాలు సాధించారు. మిస్బా ఉల్ హక్, అసద్ షఫీక్ చెరి ఐదు పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.