క్రీడాభూమి

కోహ్లీ సేనకు అగ్ని పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 24: నిరుటి రన్నరప్‌గా ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగినప్పటికీ, వైఫల్యాల బాటలో నడుస్తున్న రాయల్ చారెంజర్స్ బెంగళూరుకు మంగళవారం నాటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఈ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చావుదెబ్బతిన్నది. కేవలం 132 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక, 49 పరుగులకే చేతులెత్తేసింది. ఐపిఎల్ చరిత్రలోనే ఇది అత్యల్ప స్కోరుగా రికార్డయింది. కోహ్లీ, క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్ వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ, ఏ ఒక్కరూ డబుల్ డిజిట్స్‌కు చేరుకోలేకపోవడం విచిత్రం. కేదార్ జాదవ్ తొమ్మిది పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, ఆ జట్టు బ్యాటింగ్ ఏ స్థాయిలో విఫలమైందో ఊహించడం కష్టం కాదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో, డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్‌ను బెంగళూరు ఏ విధంగా ఢీ కొంటుందనేది ఆసక్తి రేపుతున్నది. ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలను ఎదుర్కొని, కేవలం నాలుగు పాయింట్లతో బెంగళూరు అట్టడుగు స్థానంలో ఉంది. ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఓడితే, ఆతర్వాత పుంజుకోవడం బెంగళూరుకు అసాధ్యమవుతుందని నిపుణుల అభిప్రాయం. కాగా, సన్‌రైజర్స్ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ప్లే ఆఫ్ దశకు చేరుకునే అవకాశాలను మెరుగుపరచుకుంది. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన చివరి మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సమయోచిత బ్యాటింగ్‌తో, పుణే జట్టు చివరి బంతిలో విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమి సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేది కాదన్నది వాస్తవం. మంగళవారం బెంగళూరును ఓడించి, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా సన్‌రైజర్స్ మ్యాచ్‌కి సిద్ధమవుతున్నది. ఈ పరిస్థితుల్లో కోహ్లీ సేన ఎంత వరకూ ఎదురుదాడి చేస్తుందో చూడాలి.
కాగితంపై చూస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయ. రెండు జట్లలోనూ, ఒంటి చేత్తో విజయాలను సాధించిపెట్టగల సమర్థులు ఉన్నారు. కానీ, ఎవరు ఎప్పుడు, ఏ విధంగా రాణిస్తారో? ఎందుకు విఫలమవుతారో తెలియని పరిస్థితి. నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్కరు కూడా డబుల్ డిజిట్స్‌కు చేరుకోలేకపోవడమే బెంగళూరు నిడకడలేమిని స్పష్టం చే స్తున్నది. దీనికితోడు, ఈసారి టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌ను ఎదుర్కొని ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో బెంగళూరు తీవ్రమైన ఒత్తిడి మధ్య ఆడుతుందని, సన్‌రైజ ర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని స్పష్టమవుతున్నది. ఒత్తిడిని బెంగళూరు అధిగమిస్తుందా లేక సన్‌రైజర్స్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ చేతులెలె త్తేస్తుందా అన్నది ఆసక్తిని రేపుతున్నది.
ఐపిఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆవేదన చెందుతున్నాడు. ఈ పరిస్థితికి కారణాలను వెతకదలచుకో లేదని అతను స్పష్టం చేశాడు. నిర్లక్ష్యంగా ఆడి, వికెట్లు పారేసుకోవడమే ఓటమికి ప్రధాన కారణమని వాపోయాడు. అసలు చెప్పడానికి తన వద్ద ఎలాంటి మాటలు లేవని, అంత చెత్తగా ఆడామని వ్యాఖ్యానించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటింగ్ కుప్పకూలిందని అన్నాడు. నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని అంగీకరించాడు. అయతే, ఆ పరాజయాన్ని మరచిపోయ, తదుపరి మ్యాచ్‌లకు సిద్ధమవుతామని కోహ్లీ అన్నాడు. ఎక్కడ పొరపాట్లు చేశామనే విషయం ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్కరికీ అర్థమై ఉంటుందని అన్నాడు. కాబట్టి, ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదన్నాడు. ఈ టోర్నమెంట్‌లో, ఇక ముందు తాము అంత దారుణంగా మరోసారి బ్యాటింగ్ చేయబోమని అన్నాడు. మళ్లీ పుంజుకోగలమన్న నమ్మకం తనకు ఉందని చెప్పాడు.