క్రీడాభూమి

సత్తా చాటిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: యుఎస్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో భారత్ తన పోరాటాన్ని ఘనంగా ముగించింది. లాస్ వెగాస్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 16 పతకాలను కైవసం చేసుకుంది. వీటిలో మూడు పసిడి పతకాలు, రెండు రజత పతకాలు, మరో 11 కాంస్య పతకాలు ఉన్నాయి. వ్యక్తిగత ఈవెంట్లలో సైఫాలీ అగర్వాల్ పసిడి పతకాన్ని, అభిషేక్ సేన్‌గుప్తా రజత పతకాన్ని గెలుచుకోగా, టీమ్ ఈవెంట్‌లో కూడా భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. సెనె్సయి యశ్‌పాల్ సింగ్ నేతృత్వంలో అభిషేక్ సేన్‌గుప్తా, రణ్‌తేజ్ సింగ్, హర్‌చరణ్ సింగ్ చౌహాన్, సైఫాలీ అగర్వాల్‌తో కూడిన భారత జట్టు సెనె్సయి కాల్సీ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఈ ఘనత సాధించింది.

తొలి టెస్టులో విండీస్‌పై పాక్ గెలుపు

జమైకా, ఏప్రిల్ 25: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 4 వికెట్ల నష్టానికి 93 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ జట్టును పాక్ బౌలర్ యాసిర్ షా గడగడ లాడించాడు. నిప్పులు చెరిగే బంతులతో విజృంభించిన అతను 63 పరుగులకే 6 వికెట్లు కైవసం చేసుకోగా, మొహమ్మద్ అబ్బాస్ (2/35), మొహమ్మద్ అమీర్ (1/20), వహాబ్ రియాజ్ (1/29) తమ వంతు రాణించారు. దీంతో వెస్టిండీస్ 52.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటవగా, 32 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టులో ఓపెనర్లు అహ్మద్ షెహజాద్ (7), అజర్ అలీ (1)తో పాటు యూనిస్ ఖాన్ (6) త్వరత్వరగా నిష్క్రమించినప్పటికీ ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ (9), కెప్టెన్ మిస్బా ఉల్‌హక్ (12) అజేయంగా నిలిచి పని పూర్తి చేశారు. దీంతో 10.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు సాధించిన పాక్ 7 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది.

చాలెంజర్స్, సన్‌రైజర్స్ మ్యాచ్ వర్షార్పణం
బెంగళూరు, ఏప్రిల్ 25: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో మంగళవారం రాయల్ చాలెంజర్స్, డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వరుణుడి ఆగ్రహానికి తుడిచిపెట్టుకుపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావలసి ఉండగా, ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కనీసం ఒక్క బాల్ ఆట కూడా సాగలేదు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు రాత్రి 11 గంటల వరకూ ఎదురు చూసినప్పటికీ వరుణుడు కరుణించలేదు. దీంతో ప్రారంభం కాకుండానే ఈ మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించిన ఐపిఎల్ టోర్నీ నిర్వాహకులు ఇరు జట్లకు చెరో పాయింట్ చొప్పున కేటాయంచారు.