క్రీడాభూమి

సొత్సోబ్‌పై సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, ఏప్రిల్ 25: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా బౌలర్ లోన్వాబో సొత్సోబ్ (33)పై వేటు పడింది. ఈ ఆరోపణలపై సుదీర్ఘ దర్యాప్తు జరిపించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సిఎస్‌ఎ) తక్షణమే అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకూ ఐదు టెస్టులు, మరో 61 వనే్డ మ్యాచ్‌లు ఆడిన సొత్సోబ్ 2015లో దక్షిణాఫ్రికా దేశవాళీ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దాదాపు ఏడాది కాలం నుంచి అతను దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో మ్యాచ్‌ల ఫలితాలను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించారన్న అభియోగాలతో ఆరుగురు ఇతర ఆటగాళ్లపై సిఎస్‌ఎ ఇప్పటికే నిషేధం విధించింది. ఈ సిరీస్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు సొత్సోబ్ లంచాన్ని అందుకోబోయినట్లు దర్యాప్తులో తేలిందని, అందుకే అతడిపై నిరవధిక సస్పెన్షన్ విధించామని సిఎస్‌ఎ వివరించింది.