క్రీడాభూమి

విశాఖలో క్రికెటర్లకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: మూడు మ్యాచ్‌ల టి- 20 సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ఆడేందుకు భారత్, శ్రీలంక జట్లు శనివారం విశాఖ చేరుకున్నాయి. విశాఖ ఎసిఎ - విడిసిఎ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు మూడో టి- 20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్, శ్రీలంక జట్లు చివరి మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. పూణేలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత, రాంచీలో జరిగిన రెండో మ్యాచ్‌ను భారీ విజయంతో దక్కించుకున్న భారత్ అదే ఊపును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ సిరీస్‌ను కోల్పోయిన ధోనీ సేన, టి- 20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. విశాఖలో భారత్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉన్నందున గెలుపుపై స్థానికుల్లో భారీ అంచనాలున్నాయి. చివరి మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు ఆదివారం ఉదయం స్టేడియంలో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం విశాఖ చేరుకున్న ఇరు జట్లకు విమానాశ్రయంలో విడిసిఎ - ఎసిఎ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హోటల్‌కు చేరుకున్న వీరికి యాజమాన్యం సంప్రదాయ రీతిలో స్వాగతం పలికింది.
ఫేవరిట్ భారత్