క్రీడాభూమి

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ సైనా అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింధు ముందంజ
ఉహాన్ (చైనా), ఏప్రిల్ 26: ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి, మాజీ ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్ ఓటమిపాలై నిష్క్రమించింది. అయితే, మరో హైదరాబాదీ, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు తన ప్రత్యర్థిని ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. జపాన్‌కు చెందిన సయాకా సటోను ఢీకొన్న సైనా 21-19, 16-21, 18-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఆమె చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే, అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన సింధు 21-8, 21-18 ఆధిక్యంతో దినార్ డయా అయుస్టిన్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఐద సీడ్ హౌవెయ్ తియాన్ (చైనా)ను 21-18, 18-21, 21-19 తేడాతో ఓడించి సంచలనం సృష్టించిన అజయ్ జయరామ్ రెండో రౌండ్ చేరాడు. అతను రెండో రౌండ్‌లో హు యున్‌తో తలపడతాడు. కాగా, మరో భారతీయుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌కి ఓటమి తప్పలేదు. ఆగ్నస్ ఇంగ్‌ను ఢీకొన్న అతను 16-21, 21-13, 19-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు.