క్రీడాభూమి

ఐఒసిలో నీతా అంబానీకి జోడు పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) కమిటీలో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీకి తాజాగా రెండు కీలక పదవులు లభించాయి. ఆమెను ఒలింపిక్ చానెల్, విద్యా కమిటీల్లో సభ్యురాలిగా తీసుకున్నట్టు ఐఒసి తాజా ప్రకటనలో తెలిపింది. ఒలింపిక్ స్ఫూర్తిని ప్రచారం చేయడంతోపాటు, క్రీడాభివృద్ధి లక్ష్యంగా ఐఒసి చానెల్ ఏడాది క్రితం ప్రసారాలను మొదలుపెట్టింది. అమెరికా ఒలింపిక్ కమిటీ చైర్మన్ లారెన్స్ ఫ్రాన్సిస్ ప్రొస్ట్ అధ్యక్షుడిగా నియమిస్తూ ఐఒసి ప్రటించిన 16 మంది సభ్యులతో కూడిన కమిటీలో నీతా అంబానీకి కూడా చోటు దక్కింది. కాగా, ఒలింపిక్ ఎడ్యుకేషన్ కమిటీకి న్యూజిలాండ్ హాకీ మాజీ క్రీడాకారుడు, 1976 ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత బారీ జాన్ మెయిస్టర్‌ను అధ్యక్షుడిగా ఐఒసి ప్రకటించింది. ఈ కమిటీలో నీతా అంబానీసహా మొత్తం 24 మంది సభ్యులుగా ఉన్నారు. ఐఒసి పాలక మండలి సభ్యురాలిగా నిరుడు ఎంపికైన 53 ఏళ్ల నీతా అంబానీ 70 సంవత్సరాల వయసు వచ్చేవరకూ తాజాగా లభించిన జోడు పదవుల్లో కొనసాగుతుంది.