క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీకి జట్టేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లో ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు జరిగే ప్రతిష్ఠాత్మక టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించాల్సిన తుది గడువు ముగిసినా బిసిసిఐ స్పందించలేదు. ఎనిమిది దేశాలు పోటీలో ఉండే ఈ టోర్నీకి ఏడు దేశాలు ఇప్పటికే జాబితాను ఐసిసికి పంపాయి. భారత్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే జట్టు వివరాలను పంపలేదని సమాచారం. ‘బిగ్ త్రీ’ దేశాలకు అందుతున్న భారీ వాటాలో కోత విధించాలని ఐసిసి తాత్కాలిక అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ప్రయత్నాలను తిప్పికొట్టడానికే బిసిసిఐ ఈ ఎత్తు వేసిందన్నది వాస్తవం. నిజానికి ఈ వివాదం కారణంగానే మనోహర్ తన పదవికి రాజీనామా చేశాడన్న వార్త ప్రచారంలో ఉంది. అయితే, పలు కీలక అంశాలపై తీర్మానాలను ఆమోదించాల్సిన తరుణంలో, పాలక మండలి సమావేశాలు పూర్తయ్యే వరకూ పదవిలో కొనసాగాలని ఐసిసి కోరింది. దీనితో అతను తన రాజీనామాను వెనక్కు తీసుకొని, తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నాడు. ఇలావుంటే, తాను రాజీనామా చేయడానికంకే ముందే అతను బిసిసిఐకి సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల కమిటీ సభ్యుడు విక్రం లిమాయేతో సమావేశమయ్యాడని వార్తలు వచ్చాయి. ఐసిసి వాటాలో ‘బిగ్ త్రీ’గా పిలిచే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులకు అత్యధిక వాటాను ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పాలని మనోహర్ చేసిన ప్రతిపాదనను లిమాయే తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. కాగా, ఫిబ్రవరిలో జరిగిన ఐసిసి పాలక మండలి సమావేశంలో లాంఛనంగా ఆమోద ముద్ర లభించిన ప్రతిపాదనలకు అనుకూలంగా తాజా సమావేశాల్లో తీర్మానాలను అమోదించాలి. తాను సూచించిన ప్రతిపాదనలకు తానే సవరణలు చేసి, బిసిసిఐకి అనుకూలంగా తీర్మానాలను ప్రవేశపెట్టాల్సిన పరిస్థితిని తప్పించుకోవాలన్నదే మనోహర్ అభిప్రాయంగా కనిపించింది. అంతేగాక, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే క్రికెట్ బోర్డుల అధికారులతో సమావేశాలు జరిపి, ఆయా దేశాల మద్దతు ఉన్నట్టు ప్రచారం చేసుకుంది. కానీ, బిసిసిఐ ప్రయత్నాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. పూర్తి ఆత్మరక్షణలోకి వెళ్లిపోయాడనుకున్న మనోహర్ మెరుపుదాడి చేశాడు. తన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయించుకోగలిగాడు. అప్పటి వరకూ కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నట్టు కనిపించిన బిసిసిఐ చావుదెబ్బ తిన్నది. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించకపోవడం ద్వారా ఐసిసిని ఇరుకున పెట్టాలని చూసినప్పటికీ, ఆ ప్రయత్నం ఫలించలేదు. ఏవైనా ప్రత్యేక పరిస్థితుల్లో జట్టును ఆలస్యంగా ప్రకటించేందుకు అవకాశం ఉంది. అయితే, ముందునే ఐసిసికి సమాచారాన్ని ఇవ్వాలి. కానీ, బిసిసిఐ ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అనుమతి పొందలేదు. ఇదే విషయాన్ని బిసిసిఐ అధికారి ముందు పిటిఐ ప్రస్తావించగా, జట్టులోని 15 మందిలో దాదాపుగా 14 మంది పేర్లు అందరికీ తెలిసినవేనని వ్యాఖ్యానించాడు. వారి ఎంపిక ఖాయమని అంటూ, ఒకవేళ మే మొదటివారంలో జట్టును ప్రకటిస్తే చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు వీల్లేదని గెంటేస్తారా? అని ఎదురు ప్రశ్న వేశాడు. ఆటగాళ్ల పేర్లు ఖరారైనప్పుడు, పేర్లను ఐసిసికి ఎందుకు పంపలేదన్న అనుమానం తలెత్తుతున్నది. ఐసిసిని ఇరుకున పెట్టి, తన డిమాండ్లను సాధించుకోవడమే లక్ష్యమన్న విషయం స్పష్టంగా కనిపించింది. అయితే, చివరి క్షణాల్లో బిసిసిఐ ఎత్తుగడ బెడిసికొట్టింది. భారత్ పరిస్థితి అనుకున్నది ఒకటి, అయనది మరొకటిగా మారింది. తాను తీసుకున్న గోతిలో తానే పడింది.