క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్‌లో బిసిసిఐ ఏకాకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: తన డిమాండ్లను సాధించుకోవడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)పై ఒత్తిడిని పెంచాలనుకున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాచిక పారలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో బిసిసిఐ ఏకాకిగా మిగిలింది. చైర్మన్ శశాంక్ మనోహర్ సూచించిన ప్రతిపాదనలకు ఐసిసి ఆమోదం లభించింది. తన డిమాండ్లను సాధించుకోవడానికి బిసిసిఐ చాలా ప్రయత్నాలే చేసింది. దీని కోసం ఐసిసిపై ఒత్తిడిని తీసుకురావడానికి శతవిధాలా పోరాడింది. కానీ, చివరికి మనోహర్ పంతమే నెగ్గింది. అతను చేసిన ప్రతిపాదనలకు టెస్టు హోదాగల పది దేశాల్లో కనీసం ఏడు దేశాల నుంచి సానుకూల స్పందన లభించాల్సి ఉండగా, పాలనాపరమైన అంశాల్లో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలకు తొమ్మిది దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. కేవలం బిసిసిఐ మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేసింది. ఒకవేళ నాలుగు దేశాలు ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తే, అవి ఆమోదానికి నోచుకోవన్న ధైర్యంతో, బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే క్రికెట్ బోర్డులతో చర్చలు కూడా జరిపింది. ఆ నాలుగు బోర్డులు తనతో కలిసొస్తారని నమ్మింది. కానీ, నిన్నమొన్నటి వరకూ సానుకూ ప్రకటనలిచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా చివరికి ప్లేటు ఫిరాయించింది. మనోహర్‌కే జైకొట్టింది. ఇప్పుడు పాలక మండలి సమావేశంలో ఆమోదించిన తీర్మానాలే సెప్టెంబర్‌లో జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చకు వస్తాయి. ఆతర్వాత సమావేశం తీర్మానాలను ఆమోదించడం ఇక లాంఛనమే.
ఇలావుంటే, ఐసిసిలో వాటాలకు సంబంధించి ఒకానొక దశలో ఐసిసి రాజీకి వచ్చినట్టు కనిపించింది. అయితే, మొండిపట్టుపట్టిన బిసిసిఐ డిమాండ్ చేస్తున్నంత మొత్తాన్ని ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కనీసం కొంతైనా వాటాను వదులుకోవాలని మనోహర్ ఎంతగా చెప్పినా వినకుండా మొండిగా ముందుకెళ్లిన బిసిసిఐ భారీ మూల్యానే్న చెల్లించుకుంది. భారత్‌తోపాటు ఐసిసి ఆదాయంలో ఎక్కువ వాటా పొందుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు కూడా మనోహర్ ప్రతిపాదనలకు సానుకూలత చూపడం గమనార్హం. ఈ అంశంపై జరిగిన ఓటింగ్‌లో పది టెస్టు హోదాగల దేశాలకుగాను తొమ్మిది దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. బిసిసిఐ ఒక్కటే వ్యతిరేకించి, ఏకాకిగా నిలిచిపోయింది. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా నిలువునా మునిగింది.