క్రీడాభూమి

నైట్ రైడర్స్ ‘డబుల్ హ్యాట్రిక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఏప్రిల్ 26: మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసిఎ) మైదానంలో బుధవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాబిన్ ఉతప్ప బాధ్యతాయుతమైన ఆట నైట్ రైడర్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మైదానంలో నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజేతగా నిలిచి ‘డబుల్ హ్యాట్రిక్’ సాధించడం విశేషం. ప్రత్యర్థి నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే, మూడు వికెట్ల నష్టంతో ఛేదించింది.
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న నైట్ రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 182 పరుగులు సాధించింది. మొదటి వికెట్‌కు 65 పరుగులు జత కలిసిన తర్వాత అవుటైన రాహుల్ త్రిఫాఠీ 38 పరుగులు సాధించాడు. 23 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఏడు ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ అజింక్య రహానే 41 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ప్రస్తుత కెప్టెన్ స్టీవెన్ స్మిత్ స్కోరుబోర్డును ముందుకు దూకించాడు. ధోనీ 23 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుట్ కాగా, స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. 37 బంతులు ఎదుర్కొని, 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు సాధించిన అతను నాటౌట్‌గా మిగాలాడు. అంతకు ముందు మనోజ్ తివారీ ఒక పరుగు చేసి వెనుదిరగ్గా, డానియల్ క్రిస్టియన్ 16 పరుగులు చేసి, ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటయ్యాడు. కోల్‌కతా బౌలర్ కుల్దీప్ యాదవ్ 31 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, సునీల్ నారైన్ చెరో వికెట్ కూల్చారు.
ఉతప్ప విజృంభణ
కెప్టెన్ గౌతం గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నైట్ రైడర్స్ స్పెషలిస్టు స్పిన్నర్ సునీల్ నారైన్ 11 బంతుల్లో 16 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. 20 పరుగుల వద్ద తొలి వికెట్ కూలగా, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రాబిన్ ఉతప్ప ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. గంభీర్ అతనికి మద్దతునిచ్చే పాత్రను పోషిస్తే, ఉతప్ప వేగంగా పరుగులు రాబట్టాడు. 25 బంతుల్లోనే అతను అర్ధ శతకాన్ని సాధించాడు. గంభీర్ కూడా అతనితోపాటు ముందుకు కదులుతూ, 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కాగా, గంభీర్‌తో కలిసి మూడో వికెట్‌కు 14.1 ఓవర్లలో 158 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఉతప్ప 47 బంతుల్లో 87 పరుగులు సాధించి జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠీ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. అతని స్కోరులో నాలుగు ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లు ఉన్నాయి. ఉతప్ప 178 పరుగుల వద్ద అవుట్‌కాగా, నైట్ రైడర్స్ విజయానికి కేవలం ఐదు పరుగుల దూరంలో నిలిచింది. అయితే, డానియల్ క్రిస్టియన్ వేసిన తర్వాతి ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ అందుకోగా గంభీర్ అవుటయ్యాడు. అతను 46 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62 పరుగులు సాధించాడు. ఐపిఎల్‌లో మొట్టమొదటిసారి ఆడుతున్న డారెన్ బ్రేవో సింగిల్‌తో ఖాతా తెరిచాడు. క్రిస్టియన్ బౌలింగ్ చివరి బంతిలో సింగిల్ తీసిన అతను శార్దూల్ ఠాకూర్ వేసిన ఓవర్ మొదటి బంతిని ఫోర్ కొట్టడంతో నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
సంక్షిప్త స్కోర్లు
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 (అజింక్య రహానే 46, రాహుల్ త్రిపాఠీ 38, స్టీవెన్ స్మిత్ 51, మహేంద్ర సింగ్ ధోనీ 23, కుల్దీప్ యాదవ్ 2/31, ఉమేష్ యాదవ్ 1/28, సునీల్ నారైన్ 1/34).
కోల్‌కతా నైట్ రైడర్స్: 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 184 (రాబిన్ ఉతప్ప 87, గౌతం గంభీర్ 62).

* ఒకే ఓవర్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ స్టంప్ అవుట్ కావడం ఐపిఎల్ చరిత్రలో రెండోసారి చోటు చేసుకుంది. 2009లోరాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ స్టంప్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, మనోజ్ తివారీలను కోల్‌కతా నైట్ రైడర్స్ వికెట్‌కీపర్ రాబిన్ ఉతప్ప స్టంప్ చేశాడు.