క్రీడాభూమి

క్వార్టర్స్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 27: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, తెలుగు తేజం పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రెండో రౌండ్‌లో ఆమె జపాన్‌కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి అయా ఒహొరీని 21-14, 21-15 తేడాతో సులభంగా ఓడించి, టైటిల్ దిశగా ముందడుగు వేసింది. క్వార్టర్స్‌లో ఆమె చైనాకు చెందిన హి బింజియావోను ఢీ కొంటుంది. ఇలావుంటే, పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో చైనా ఐదో సీడ్ తియాన్ హౌవెయ్‌ని ఓడించి సంచలనం సృష్టించిన అజయ్ జయరామ్ రెండో రౌండ్‌లో సూ జెన్ హవో చేతిలో 19-21, 10-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ 15-21, 21-14, 16-21 తేడాతో జెంగ్ సివెయ్, చెన్ క్వింగ్‌చెన్ జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల డబుల్స్ విభాగంలో అశ్వినీ పొన్నప్ప, సిక్కీ రెడ్డి జోడీ కూడా ఓటమిపాలైంది. చయే యూ జంగ్, కిమ్ సొ ఇయాంగ్ 22-20, 21-16 ఆధిక్యంతో అశ్వినీ, సిక్కీ రెడ్డి జోడీపై గెలిచింది.

చిత్రం..పివి సింధు