క్రీడాభూమి

క్వింటన్ డికాక్ స్థానంలో ఆల్‌రౌండర్ శామ్యూల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: గాయపడిన క్వింటన్ డికాక్ స్థానంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లొన్ శామ్యూల్స్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ తీసుకుంది. ఈ మార్పును ఆమోదిస్తున్నట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెల న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లినప్పుడు డికాక్ గాయపడ్డాడు. అతని కుడి చూపుడు వేలుకు తగిలిన గాయం ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో, అతని స్థానంలో శామ్యూల్స్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా డేర్‌డెవిల్స్ చేసిన ప్రతిపాదనను అంగీకరించినట్టు తెలిపింది.