క్రీడాభూమి

నేడు విండీస్‌తో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: అండర్-19 ప్రపంచ కప్‌లో టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న భారత జట్టు ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే ఫైనల్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. మాజీ టెస్టు క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న భారత అండర్-19 జట్టు ఈటోర్నలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నది. ఆటగాళ్లంతా మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థులపై సులభంగానే విజయాలను సాధిస్తున్నది. అదే దూకుడును ప్రదర్శించి, టైటిల్ పోరులో వెస్టిండీస్‌ను కూడా చిత్తు చేయాలన్న పట్టుదలతో ఉంది. 1988లో మొదటిసారి ఈ టోర్నీ ఆరంభంకాగా, ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా, భారత్ మాత్రమే చెరి మూడు పర్యాయాలు విజేతగా నిలవగలిగాయి. ఆదివారం విండీస్‌ను ఓడిస్తే, ఎక్కువ సార్లు (నాలుగు) టైటిల్ సాధించిన జట్టుగా భారత్ అవతరిస్తుంది.
టైటిల్ గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు ముద్ర వేస్తున్నప్పటికీ, వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదు. తమ గ్రూప్‌లో రెండో స్థానాన్ని ఆక్రమించిన విండీస్ క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిలకడగా ఆడడంలో మేటి జట్టుగా పేరు సంపాదించిన విండీస్‌ను ఓడించడం భారత్‌కు అసాధ్యం కాకపోయినా సులభం మాత్రం కాదు. రిషభ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తున్న కప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించడం భారత్‌కు కలిసొస్తున్న అంశం. రిషభ్ అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అన్మోల్‌ప్రీత్ సింగ్, సర్ఫ్‌రాజ్ ఖాన్, మాయాంగ్ దగర్ వంటి మేటి ఆటగాళ్ల అండ భారత్‌కు ఉంది. మరోవైపు విండీస్ ఎక్కువగా ఆల్‌రౌండర్ షామర్ స్ప్రింగర్ భుజాలపైనే భారాన్ని మోపి బరిలోకి దిగుతున్నది. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో చెలరేగితే, భారత బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు తప్పవు. మొత్తం మీద, స్థూలంగా చూస్తే విండీస్‌పై భారత్‌కే విజయావకాశాలు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. కానీ, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి, నిర్లక్ష్యంగా ఆడితే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.