క్రీడాభూమి

పంజా విసిరిన లయన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో రెండోసారి ఆలౌటైంది. గతంలో ఎన్నడూ ఈ జట్టు ఒకే సీజన్‌లో రెండు పర్యాయాలు ఈ విధంగా ఆలౌట్ కాలేదు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ వంటి హేమాహేమీలు ఉన్న బెంగళూరు ఇలా విఫలం కావడం విచిత్రం.
ఎబి డివిలియర్స్ 11 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులకే అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రయక్ రేటు 45.45 మాత్రమే. కనీసం పది బంతులు ఎదుర్కొన్న ఒక ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ ఈ విధంగా అతి తక్కువ స్ట్రయక్ రేట్‌ను నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఆరంభంలో రాణించిన అతను క్రమంగా విఫలంకావడం గమనార్హం.
*
బెంగళూరు, ఏప్రిల్ 27: స్థానిక చిన్నస్వామి స్టేడియంలో గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ 31వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ లయన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. హోం గ్రౌండ్‌లోనే, అంత వరకూ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న గుజరాత్ చేతిలో బెంగళూరు ఓడడం అభిమానులను నిరాశ పరచింది. బౌలింగ్‌లో ఆండ్రూ టై రాణించడంతో, బెంగళూరును 134 పరుగులకు కట్టడి చేసిన గుజరాత్ ఆతర్వాత ఆరోన్ ఫించ్ విజృంభణతో సునాయాస విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్‌ను ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగే అవకాశం బెంగళూరుకు దక్కింది. క్రిస్ గేల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి వికెట్‌కు 22 పరుగులు జోడించి వెనుదిరిగాడు. 13 బంతుల్లో 10 పరుగులు చేసిన అతనిని ఆరోన్ ఫించ్ క్యాచ్ పట్టగా బాసిల్ థంపి అవుట్ చేశాడు. ఈ ఐపిఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ ఆండ్రూ టై తన మొదటి ఓవర్, మొదటి రెండు బంతుల్లో క్రిస్ గేల్ (8), ట్రావిస్ హెడ్ (0) వికెట్లు పడగొట్టి బెంగళూరును కష్టాల్లోకి నెట్టాడు. క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్టు కనిపించిన కేదార్ జాదవ్ 18 బంతుల్లోనే, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద ఎబి డివిలియర్స్ (5) రనౌట్ కావడంతో, బెంగళూరు పెద్ద స్కోరు చేసే అవకాశాలకు గండిపడింది. టాప్ స్కోరర్ పవన్ నేగీ 19 బంతుల్లో 32 పరుగులు చేసి, అంకిత్ సోనీ బౌలింగ్‌లో బాసిల్ థంపి క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. శామ్యూల్ బద్రీ (3), మన్దీప్ సింగ్ (8), శ్రీనాథ్ అరవింద్ (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఇన్నింగ్స్ చివరి బంతికి యుజువేంద్ర చాహల్ (1) రనౌటయ్యాడు. 20 ఓవర్లలో బెంగళూరు ఆలౌటైంది. అప్పటికి అంకిత్ చౌదరీ (12 బంతుల్లో 15 పరుగులు) నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్ అండ్రూ టై 12 బంతులకు మూడు వికెట్లు కూల్చాడు. రవీంద్ర జడేజా 28 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. బాసిల్ థంపి, అంకిత్ సోనీ, జేమ్స్ ఫాల్క్‌నెర్ తలా ఒక వికెట్ సాధించారు.
చెలరేగిన ఫించ్
ఈ ఇన్నింగ్స్‌లో 135 పరుగులు చేసి, బెంగళూరును ఓడించడం ద్వారా పాయింట్ల పట్టికలో కొంతవరకైనా మెరుగైన స్థానం కోసం బరిలోకి దిగిన గుజరాత్ 18 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 16 పరుగులు చేసి, శామ్యూల్ బద్రీ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెదురిగాడు. మరో 14 పరుగులకే రెండో వికెట్ కూడా చేజారింది. స్టార్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కలమ్ ఆరు బంతుల్లో మూడు పరుగులు చేసి, బద్రీ బౌలింగ్‌లోనే, డివిలియర్స్‌కు చిక్కాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆరోన్ ఫించ్ చెలరేగిపోవడంతో, గుజరాత్ స్కోరుబోర్డు వేగాన్ని అందుకుంది. అతను 22 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఫించ్‌కి అవసరమైన మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించి, నింపాదిగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ సురేష్ రైనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో మన్దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ, అతని నోబాల్ కావడంతో అతను అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మొత్తం మీద మూడో వికెట్‌కు 8 ఓవర్లలో 92 పరుగులు జత కలిసిన తర్వాత ఫించ్ అవుటయ్యాడు. అతను 34 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో 72 పరుగులు చేసి, పవన్ నేగీ బౌలింగ్‌లో డివిలియర్స్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. అప్పటికి గుజరాత్ స్కోరు 115 పరుగులు. ఆతర్వాత రవీంద్ర జడేజాతో కలిసి మరో వికెట్ కూలకుండా రైనా మ్యాచ్‌ని ముగించాడు. గుజరాత్ మరో 37 బంతులు మిగిలి ఉండగానే, 13.5 ఓవర్లలో మూడు వికెట్లకు 135 పరుగులు సాధించి, బెంగళూను ఓడించింది. అప్పటికి రైనా 34, జడేజా 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. శామ్యూల్ బద్రీ ఒక్కడే మెరుగ్గా బౌలింగ్ చేసి, 29 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 134 ఆలౌట్ (కేదార్ జాదవ్ 31, పవన్ నేగీ 32, అనికేత్ చౌదరీ 15 నాటౌట్, ఆండ్రూ టై 3/12, రవీంద్ర జడేజా 2/28).
గుజరాత్ లయన్స్: 13.5 ఓవర్లలో 3 వికెట్లకు 135 (సురేష్ రైనా 34 నాటౌట్, ఆరోన్ ఫించ్ 72, శామ్యూల్ బద్రీ 2.29).

చిత్రాలు..పించ్ హిట్టర్ ఆరోన్ ఫించ్
* సూపర్ బౌలింగ్.. ఆండ్రూ టై