క్రీడాభూమి

పాక్వియావో, హార్న్స్ ఫైట్‌కు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఏప్రిల్ 28: ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ హార్న్స్‌తో ఫిలిప్పీన్స్ బాక్సర్ మానీ పాక్వియావో ఫైట్‌కు గ్రీన్ సిగగ్నల్ లభించింది. జూలై 2న బ్రిస్బేన్‌లో వీరి మధ్య ఫైట్ ఉంటుందని ఆసీస్‌కు చెందిన ప్రమోటర్లు ప్రకటించారు. పాక్వియావో నిరుడు నవంబర్‌లో ప్రపంచ బాక్సింగ్స్ సంస్థ (డబ్ల్యుబివో) టైటిల్‌ను వరుసగా మూడోసారి నిలబెట్టుకొని హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. మాజీ చాంపియన్ జెస్సీ వర్గాస్‌తో జరిగిన ఫైట్‌లో 39 పాక్వియావో మొదటి నుంచే ఆధిపత్యాన్ని కనబరిచాడు. ప్రత్యర్థిపై లెఫ్ట్, రైట్ కాంబినేషన్ హుక్స్‌తో విరుచుకుపడ్డాడు. నిజానికి ఈ ఫైట్‌లో వర్గాస్‌ను మీడియా ఫేవరిట్‌గా పేర్కొంది. కానీ, ఇంతకు ముందు రిటైర్మెంట్‌ను ప్రకటించి, అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టిన పాక్వియానో అన్ని రకాలుగా ఆధిపత్యాన్ని కనబరచి, కెరీర్‌లో 59వ విజయాన్ని నమోదు చేశాడు. రిఫరీలంతా ఏకగ్రీవంగా అతనిని విజేతగా ప్రకటించారు. కాగా, కెరీర్‌లో మొత్తం 67 ఫైట్స్‌లో పోటీపడిన పాక్వియావో ఆరు పరాజయాలను చవిచూశాడు. రెండు ఫైట్స్‌లో ఫలితం తేలలేదు. మిగతా 59 ఫైట్స్‌లో అతను విజయాలు నమోదు చేశాడు.
పాక్వియావో, వర్గాస్ మధ్య జరిగిన డబ్ల్యుబివో పోరు రికార్డు ఫైట్‌గా చరిత్ర సృష్టించింది. ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పాక్వియావో అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్రీడాకారులు చాలా మందే కనిపిస్తారుగానీ, బాక్సర్లు మాత్రం చాలా తక్కువ. మహమ్మద్ అలీ, విటాలీ క్లిచ్కో, అలెక్స్ ఆర్గుయేలో, జాన్ మోరిసే వంటి కొంత మంది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎవరూ నిలదొక్కుకోలేకపోయాడు. ఎన్నికల్లో పోటీ చేసి, ఒక దేశ పార్లమెంటుకు ఎన్నికైన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించిన పాక్వియావో రికార్డు నెలకొల్పాడు. బాక్సింగ్ టైటిల్‌ను అందుకున్న మొదటి బాక్సర్‌గా చరిత్రలో ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. ఇలావుంటే, వర్గాస్‌తో పోరు తర్వాత పాక్వియావో తదుపరి ప్రత్యర్థి ఎవరన్నది ఉత్కంఠ రేపింది. ఎన్నో పేర్లు వినిపించినప్పటికీ, చివరికి హార్న్స్ పేరు ఖాయమైంది.