క్రీడాభూమి

ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అద్వానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, ఏప్రిల్ 28: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు పంకజ్ అద్వానీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ బిలాల్‌ను 5-0 తేడాతో అతను చిత్తుచేశాడు. పదహారు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న అతను ఫైనల్‌లో చైనాకు చెందిన రెండో సీడ్ లివ్ హవోతియన్‌తో తలపడతాడు. మరో సెమీ ఫైనల్‌లో హవోతియన్ 5-3 తేడాతో మహమ్మద్ షెహాబ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)పై విజయం సాధించాడు. జాతీయ, ఆసియా ప్రపంచ స్థాయి బిలియర్డ్స్ చాంపియన్‌షిప్స్‌ను కైవసం చేసుకున్న అద్వానీ స్నూకర్స్ విభాగంలో జాతీయ, ప్రపంచ చాంపియన్. ఆసియా చాంపియన్‌షిప్‌ను కూడా గెల్చుకుంటే, ‘కెరీర్ గ్రాండ్ శ్లామ్’ను సాధించిన ఏకైన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.