క్రీడాభూమి

ఉమర్, జునైద్ వివాదంపై విచారణ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఏప్రిల్ 28: పాకిస్తాన్ క్రికెటర్లు ఉమర్ అక్మల్, జునైద్ ఖాన్ వివాదంపై విచారణకు ఒక కమిటీని నియమించారు. పాకిస్తాన్ జాతీయ వనే్డ చాంపియన్‌షిప్‌లో భాగంగా సింధ్ రావల్పిండితో మ్యాచ్ కోసం పంజాబ్ ప్రావీన్స్ జట్టు సిద్ధమవుతున్నప్పుడు చోటు చేసుకున్న సంఘటన ఇరువురు క్రికెటర్ల మధ్య అగాథాన్ని సృష్టించింది. పంజాబ్ ప్రావీన్స్‌కు ఉమర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, అదే జట్టులో జునైద్ ఉన్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు తాను మైదానంలో దిగినప్పుడు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జునైద్ కనిపించకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని విలేఖరుల సమావేశంలో ఉమర్ వ్యాఖ్యానించాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ నాసిర్ నజీర్ తుది జట్టులో కనిపించడంతో కంగుతిన్నట్టు చెప్పాడు. అయితే, ఇంటర్వ్యూలో ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే జునైద్ ఆసుపత్రి నుంచి వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో ఉంచాడు. మ్యాచ్‌ని ఆడకుండా తాను మైదానం నుంచి పారిపోయినట్టు ఉమర్ చిత్రీకరించాడని మండిపడ్డాడు. అనారోగ్య కారణంగా మ్యాచ్‌కి హాజరుకాలేనని తాను జట్టు మేనేజ్‌మెంట్‌కు ముందుగానే సమాచారం ఇచ్చానని చెప్పాడు. ఈ విషయం తెలిసినప్పటికీ, తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలావుంటే, వీరిద్దరి మధ్య రాజుకున్న వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తీవ్రంగా స్పందించింది. ఇద్దరూ జాతీయ క్రీడాకారులు కావడంతో, వివాదంపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. త్వరలోనే ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుందని, ఆతర్వాత తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని పిసిబి ప్రకటించింది.

చిత్రం..ఉమర్ అక్మల్, జునైద్ ఖాన్