క్రీడాభూమి

ముంబయ ‘సూపర్’ విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 29: చివరి వరకూ ఉత్కంఠ రేపిన ఐపిఎల్ 35వ మ్యాచ్ సూపర్ ఓవర్‌తో ముగిసింది. ఈ మ్యాచ్‌లో గుజరా త్ లయన్స్‌పై ముంబయ ఇండియన్స్ విజయం సాధించింది. అంతకు ముందు, తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్ల లో 9 వికెట్లకు 153 పరుగులు సాధించగా, ఆతర్వాత ముంబయ 20 ఓవర్లలో సరిగ్గా 153 పరుగులు చేసి ఆలౌటైంది. ఒక్కోసారి ఒక్కో జట్టు విజయానికి చేరువ కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి యని పరిస్థితి నెలకొంది. ఇరు జట్లు సమాన స్కోర్లు చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్‌లో ఒక్కో జట్టు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను, ఒక బౌలర్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. తొలుత ముంబయ ఇండియన్స్ బ్యాట్ చేసింది. ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని జొస్ బట్లర్, కీరన్ పొలార్డ్ వికెట్లను కోల్పోవడంతో, చివరి బంతిని ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న ముంబయ 11 పరుగులు చేసింది. వాటిలో పొలార్డ్ 10 పరుగులు సాధించగా, బట్లర్ ఒక పరుగు చేశాడు. అనంతరం ముంబయ తరఫున జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు దిగితే, గుజరాత్‌కు బ్యాటింగ్ చేసే బాధ్య తను తొలుత బ్రెండన్ మెక్‌కలమ్, ఆరోన్ ఫించ్ తీసుకున్నారు. ఆ ఓవర్‌లో గుజరాత్ వికెట్ కోల్పోకపోయనా, కేవలం ఆరు పరుగులు చేయగలిగింది. దీనితో ముంబయ ఇండియన్స్ విజయం సాధించింది.
గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. అయితే, ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను మినహాయిస్తే, ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో అతని నిర్ణయం అనుకున్న స్థాయిలో సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద బ్రెండన్ మెక్‌కలమ్ (6)ను లసిత్ మలింగ క్లీన్ బౌల్డ్ చేయడంతో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రైనా కేవలం ఒక పరుగు చేసి, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్‌కు చిక్కాడు. హార్డ్ హిట్టర్ ఆరోన్ ఫించ్ పరుగుల ఖాతా తెరవక ముందే మలింగ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోలేలేక, రెండు పరుగులు చేసి, కృణాల్ పాండ్య బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, పార్థీవ్ పటేల్ స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. ఈ దశలోనే ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా అవుటయ్యాడు. అతను 35 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు సాధించి, హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో కీలన్ పొలార్డ్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. ఈ దశలో జట్టుకు అండగా నిలిచే బాధ్యతను తీసుకున్న రవీంద్ర జడేజా కొంత సేపు పోరాటం సాగించాడు. అయితే, 21 బంతుల్లో 28 పరుగులు చేసిన అతను కృణాల్ పాండ్య బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పదో ఐపిఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్ పఠాన్ కేవలం రెండు పరుగులు చేసి, కృణాల్ పాండ్య బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యకు చిక్కాడు. ఆండ్రూ టై 12 బంతుల్లో 25 పరుగులు చేసి రనౌటయ్యాడు. కాగా, జేమ్స్ ఫాల్క్‌నర్ కొద్దిసేపు ముంబయి బౌలింగ్‌ను ప్రతిఘటించి, 27 బంతులు ఎదుర్కొని, 21 పరుగులు చేసి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేయగా, బాసిల్ థంపి 2, అంకిత్ సోనీ 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. కృణాల్ పాండక్య 14 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రా చెరి రెండు వికెట్లు కూల్చారు.
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సమానంగా అగ్రస్థానానికి దూసుకెళ్లేందుకు 153 పరుగులు చేయాల్సిన ముంబయి మొదటి వికెట్‌ను జొస్ బట్లర్ రూపంలో చేజార్చుకుంది. అతను తొమ్మిది పరుగులు చేసి రనౌటయ్యాడు. ఈ టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా రాణిస్తున్న నితీష్ రాణా 16 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేసి, అంకిత్ సోనీ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. ఓపెనర్ పార్థీవ్ పటేల్ నిలకడగా ఆడుతుండగా, సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ ఐదు పరుగులు చేసి, జేమ్స్ ఫాల్క్‌నెల్ బౌలింగ్‌లో, దినేష్ కార్తీక్ చక్కటి క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 109 పరుగుల వద్ద పార్థీవ్ పటేల్ అవుట య్యాడు. 44 బంతుల్లో 70 పరుగులు సాధించిన అతని స్కోరు లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయ. పార్థీవ్ పటేల్ సరిగ్గా 12 నెలలు, 12 ఇన్నింగ్స్ తర్వాత ఐపిఎల్‌లో హాఫ్ సెంచరీ సాధించడం గమనార్హం. జట్టు గెలుపు ఖా యంగా కనిపిస్తున్న సమయంలో, కీరన్ పొలార్డ్ (15)ను బ్రెండన్ మెక్‌కలమ్ క్యాచ్ పట్టగా బాసిల్ థంపి అవుట్ చేశాడు. అనంతరం ఒకే ఓవర్‌లో 3 వికెట్లు పడ్డాయ. 4 పరుగులు చేసిన హార్దిక్ పాం డ్యను, అదే ఓవర్‌లో హర్భజన్ సింగ్ (0)ను బాసి ల్ థంపి పెవిలియన్ పంపాడు. ఆ ఓవర్ చివరి బంతిలో నాథన్ మెక్‌క్లీనగన్ (1) రనౌటయ్యాడు. దీనితో ముంబయ చివరి ఓవర్‌లో విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచింది. ఇర్ఫాన్ పఠాన్ వేసి న ఆ చివరి ఓవర్ మొదటి బంతిని కృణాల్ పాం డ్య సిక్స్‌గా మార్చాడు. రెండో బంతిలో సింగిల్ తీ శాడు. మూడో బంతికి జస్‌ప్రీత్ బుమ్రా రనౌట య్యాడు. నాలుగో బంతిలో కృణాల్ పాండ్య రెం డు పరుగులు చేశాడు. దీనితో చివరి రెండు బంతు ల్లో రెండు పరుగులు అవసరమయ్యాయ. ఐదో బంతిలో ఒక పరుగు లభించి, స్కోర్లు సమమ య్యాయ. చివరి బంతిలో కృణాల్ పాండ్య (29) రనౌటయ్యాడు. ఇరు జట్లు సమావుజ్జీగా నిలవగా, సూపర్ ఓవర్ అవసరమైంది.