క్రీడాభూమి

తాయ్ జూకు ఆసియా టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్, ఏప్రిల్ 30: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె రెండో సీడ్ అకానే యమాగుచీని 18-21, 21-11, 21-18 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా, మిగతా రెండు సెట్లలో అద్వితీయ ప్రతిభ కనబరచి విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ రెండో సీడ్ చెన్ లాంగ్ సాధించాడు. అతను ఫైనల్‌లో నాలుగో ర్యాంక్ ఆటగాడు లిన్ డాన్‌పై 21-23, 21-11, 21-10 తేడాతో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా మూడు సెట్ల వరకూ కొనసాగడం విశేషం. మహిళల డబుల్స్ టైటిల్ మిసాకీ మత్సుతొమో, అయాకా తకహషి జోడీకి దక్కింది. వీరు ఫైనల్‌లో హ్యూ రిన్ కిమ్, యూ హయే వాన్ జోడీపై 21-19, 16-21, 21-10 ఆధిక్యంతో గెలిచారు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను లీ జున్ హుయ్, లియో యుచెన్ జోడీ సొంతం చేసుకుంది. వీరు ఫైనల్‌లో హువాంగ్ కైజియాంగ్, వాంగ్ ఇల్యుయ్ జోడీపై 21-14, 21-12 తేడతో గెలుపొందారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో లు కాయ్, హ్యుంగ్ యాక్వియాంగ్ జోడీ 21-18, 21-11 తేడాతో డెచాపొల్ పువరనుకో, సస్పిరీ తయెరతనచయ్ జోడీపై గెలిచింది.