క్రీడాభూమి

యువీకి ప్రమోషన్ కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: యువరాజ్ సింగ్‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చి, ఐదు కంటే ముందు స్థానాల్లో బరిలోకి దించడం అనుకున్నంత సులభం కాదని భారత వనే్డ, టి-20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యువీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఒక్కసారిగా మార్పు అసాధ్యమన్నాడు. శ్రీలంకతో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌పై భారత ఆశలు సజీవంగా నిలబడిన విషయం తెలిసిందే. చివరిదైన మూడో టి-20లో అమీతుమీ తేల్చుకోవడానికి ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇలావుంటే, రెండో టి-20లో ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువీ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేని హార్దిక్ పాండ్యను యువీ కంటే ముందు బ్యాటింగ్‌కు దింపడంపై విమర్శలు వినిపించాయి. చివరి టి-20 కోసం శనివారం విశాఖపట్నం బయలుదేరే ముందు అతను పిటిఐతో మాట్లాడిన ధోనీ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు కొనసాగుతున్నారని, యువీని ఓపెనర్‌గా పంపడం సాధ్యం కాదని వ్యాఖ్యానించాడు. ఫస్ట్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, సెకండ్ డౌన్‌లో సురేష్ రైనా చాలాకాలంగా ఆడుతున్నారని, వారి ప్రదర్శన కూడా సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించాడు. మొదటి నాలుగు స్థానాలు ఇప్పటికే భర్తీ అయ్యాయని, అందుకే, సమీప భవిష్యత్తులో యువీకి టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం రాదని తేల్చిచెప్పాడు. 17 లేదా 18 ఓవర్ల తర్వాత బ్యాటింగ్‌కు దిగి, భారీగా పరుగులు సాధించడం యువీకి కష్టమని అన్నాడు. అందుకే, అతని ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడమే సముజతంగా ఉంటుందని వివరించాడు.
అందరికీ అవకాశం
బ్యాట్స్‌మెన్ అందరికీ సరైన అవకాశాలు లభిస్తాయని ధోనీ చెప్పాడు. ఈఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగే టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని పలు బ్యాటింగ్ కాంబినేషన్స్‌ను సరిచూసుకుంటున్నామని చెప్పాడు. బౌలింగ్‌లోనూ అందరికీ అవకాశం ఉంటుందన్నాడు. పరిస్థితులను అనుసరించి బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాల్లో నిర్ణయాలు ఉంటాయన్నాడు. హార్దిక్ పాండ్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నాడు. అదే విధంగా జస్‌ప్రీత్ బుమ్రా కూడా సమర్థుడైన పేసర్ అని చెప్పాడు. యార్కర్లను సంధించడంలో అతను సమర్థుడని ప్రశంసించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన శిఖర్ ధావన్ 25 బంతుల్లోనే 51 పరుగులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. అతను మంచి ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉందన్నాడు. అతని షాట్ల ఎంపిక కూడా బాగా ఉందని చెప్పాడు.
నేను ఫిట్‌గా లేనా?
రిటైర్మెంట్ గురించి ఏమని ఆలోచిస్తున్నారని అడిగినప్పుడు ‘నేను ఫిట్‌గా లేనా’ అని ధోనీ ఎదురు ప్రశ్న వేశాడు. తాను వేగంగానే పరిగెడుతున్నానని అన్నాడు. ‘ఒకవేళ నేను భారీ సిక్సర్లు కొట్టడం లేదన్న కారణంగా రిటైర్ కావాలని కోరుకుంటున్నారా? ఒకవేళ అదే మీ అభిప్రాయమైతే, ఆ విషయం రాయండి. నేను సిక్సర్లు కొట్టడం లేదుకాబట్టి మీరే నన్ను రిటైర్ చేసేయండి’ అని చమత్కరించాడు.