క్రీడాభూమి

ఆసీస్ చేతిలో ఓడిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపో (మలేసియా), మే 2: ప్రతిష్టాత్మకమైన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో మంగళవారం ఇక్కడ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో ఆరంభంలో బాగానే ఆడిన భారత జట్టు ఆ తర్వాత కంగారూల జోరు ముందు నిలవలేకపోయింది. 25వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ సాధించి భారత్‌కు ఆధిక్యతలో నిలుపగా, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజృంభించారు. 30వ నిమిషంలో ఎడ్డీ ఒకెండెన్, 34వ నిమిషంలో టామ్ క్రెయిగ్, 51వ నిమిషంలో టామ్ విక్‌హామ్ వరుసగా మూడు ఫీల్డ్‌గోల్స్ సాధించడంతో ఆస్ట్రేలియా 3-1 తేడాతో భారత్‌ను ఓడించింది. అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో తొమ్మిది సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుత టోర్నీలో ఇప్పటివరకూ 3 మ్యాచ్‌లు ఆడి 7 పాయింట్లు సాధించగా, గత ఏడాది రన్నరప్ టైటిల్ సాధించిన భారత జట్టు 3 మ్యాచ్‌లు ఆడి 4 పాయింట్లు సాధించింది.