క్రీడాభూమి

టి-20 వరల్డ్ కప్ కోసం ధర్మశాల ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల కోసం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పిసిఎ) మైదానం ముస్తాబవుతున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ వచ్చేనెల 19న ఇదే వేదికపై జరగనుంది. మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్‌పిసిఎ చీఫ్ క్యూరేటర్ సునీల్ చౌహాన్ తెలిపాడు. పిచ్ ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తుందని, కాబట్టి భారీ స్కోరు తథ్యమని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. సాధారణంగా 40 ఓవర్ల వరకూ పిచ్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవని, అయితే, ఇది టి-20 ఫార్మెట్ కాబట్టి, ఇసుక, మట్టిని ఉపయోగించి పిచ్‌ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నాడు.
రెండు వామప్ మ్యాచ్‌లు
వచ్చేనెల 15న న్యూజిలాండ్‌తో టి-20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ని ఆడనున్న టీమిండియా అంతకు ముందు రెండు వామప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటుంది. మార్చి 10న చారిత్రక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వెస్టిండీస్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడుతుంది. 12న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో వామప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొంటుంది.